Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గరుడ వేగ 10 రోజులు వుందనగా గుండెపోటు వచ్చింది: రాజశేఖర్

గరుడ వేగ సినిమా ద్వారా హీరో రాజశేఖర్‌ హిట్ కొట్టేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఎదుర్కొన్న సమస్యలను హీరో రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సినిమా షూటింగ్ వారం రోజులు ఉందనగా గుండెపోటు వచ

Advertiesment
PSV Garuda Vega
, శనివారం, 11 నవంబరు 2017 (12:58 IST)
గరుడ వేగ సినిమా ద్వారా హీరో రాజశేఖర్‌ హిట్ కొట్టేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఎదుర్కొన్న సమస్యలను హీరో రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సినిమా షూటింగ్ వారం రోజులు ఉందనగా గుండెపోటు వచ్చిందని రాజశేఖర్ అన్నారు. ఈ సినిమాలో హీరో పాత్రకి చాలా ఫిజికల్ యాక్టివిటీ ఉండటంతో మూడు నెలల తర్వాత షూటింగ్ పెట్టుకోమని అమ్మానాన్నలు చెప్పారు. కానీ స్టెంట్ వేసిన పది రోజులకే తాను షూటింగ్‌కి వెళ్లిపోయానని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.
 
తాను డాక్టర్‌ని కావడంతో ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలో తెలుసు కాబట్టి.. షూటింగ్‌లో పాల్గొన్నానని.. అయితే తన తల్లిదండ్రులు చాలా బాధపడ్డారని, భయపడ్డారని రాజశేఖర్ వెల్లడించారు. ఈ సినిమా టీజర్‌లో తనను చూసి "బాగానే వున్నావ్ రా" అని అమ్మ అన్నారు. టీజర్‌కి వస్తోన్న రెస్పాన్స్‌తో అందరూ తనను అభినందించారని తెలిపారు. సొంత సినిమా చేయనని అమ్మకు మాట ఇచ్చాను గానీ, ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో తాను కూడా ఇన్వాల్వ్ కావలసి వచ్చిందన్నారు. అయితే అలాంటి అమ్మ ఇప్పుడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఏదైనా ఎమర్జెన్సీ అయితే వెంటనే తనకి కాల్ చేయమని ఎంతోమందికి చెప్పే తాను, తన కళ్ల ముందే అమ్మ చనిపోతుంటే ఏమీ చేయలేకపోయానని రాజశేఖర్ తెలిపారు. ఇక జీవితతో ఎప్పుడైనా గొడవపడితే .. అమ్మ దగ్గరికి వెళ్లిపోతాను అని బెదిరించేవాడిని. ఆ కోపం పోవడానికి అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతుండేవాడిని.. ప్రస్తుతం ఆ అవకాశం లేదని.. ఆమె తనతో లేదని రాజశేఖర్ భావోద్వేగానికి గురైయ్యారు. 
 
ఇక భాగస్వామి అయిన జీవిత రాజశేఖర్ గురించి చెబుతూ.. తాను యాక్టింగ్‌, ఆరోగ్యం సంబంధించిన విషయాలపై దృష్టి పెడితే.. ఇంటికి సంబంధించిన మిగతా విషయాలన్నీ జీవితనే చూసుకుంటూ ఉంటుంది. మా పెద్దమ్మాయి పది రోజుల పాపగా వున్నప్పుడే తాను ఔట్ డోర్ షూటింగ్‌కి తీసుకెళ్లాను. అప్పటి నుంచి ఔట్ డోర్ షూటింగ్ ఎక్కడ వున్నా వాళ్లు లేకుండగా తాను వెళ్లలేదన్నారు. 
 
పిల్లలు పుట్టాక కూడా తాను ఇంతవరకు ఒంటరిగా ఫ్లైట్‌ ఎక్కలేదు. ఎక్కడికెళ్లినా.. ఉదయం వెళ్లి సాయంత్రం రావాలన్నా నలుగురం వెళతాం .. నలుగురం వస్తాం.. ఎందుకంటే అదో భయం. ఎక్కడికి వెళ్లినా తాను కారు నడుపుతాను.. వేరే వాళ్లు కారు నడిపితే వాళ్లపై తనకు నమ్మకం వుండదన్నారు. పోతే అందరం కలిసి పోతాం.. ఉంటే అందరం కలిసి ఉంటాం.. ఆ ఉద్దేశంతోనే అలా చేస్తానని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు పవన్ డబ్బులిచ్చారా? రెండో పెళ్లి చేస్కోకుండానే చచ్చిపోతానేమో? రేణు దేశాయ్