Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ కెరీర్లో గని బెస్ట్ మూవీగా నిలుస్తుంది - నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ముద్ద

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (20:00 IST)
Allu Bobby, Sidhu Mudda
అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వరుణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర,నవీన్ చంద్ర నటీనటులుగా కిరణ్ కొర్రపాటి  దర్శకత్వంలో అల్లు బాబీ కంపెనీ, రెన‌సాన్స్ ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “గని”.ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకుని ప్రొఫెషనల్ బాక్సర్స్‌తో కలసి బాక్సర్‌గా నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి  రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. తాజాగా విడుదలైన చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా చిత్ర నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ముద్ద విలేకరులతో చిత్రం గురించి వివ‌రాలు తెలిపారు.
 
- తొలిప్రేమ, అంతరిక్షం సినిమాల నుండి వరుణ్‌తో ద‌ర్శ‌కుడు కిరణ్ జర్నీ చేస్తున్నాడు. కిరణ్ డైరెక్ట్ చేయగలడు అనుకున్న తర్వాత ఈ  కథ రెడీ అయ్యింది.
- బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేయాలనే ఆలోచన వరుణ్ ది. చాలా నిజాయితీగా చేసిన ప్రయత్నమే ఈ సినిమా
-నిర్మాతగా నాకు దర్శకుడిగా కిరణ్ కు తొలి చిత్రం. అయినప్పటికీ ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమా నిర్మించాం.
- క్రీడా రాజకీయాలను స్పృశిస్తూ కథ సాగుతుంది.
- "అమ్మ నాన్న తమిళమ్మాయి" సినిమా తరువాత బాక్సింగ్  నేపథ్యంలో సినిమాలు రాలేదు.ఆ సినిమా అమ్మ,నాన్న ,కొడుకు ల మధ్య ఉన్న ఎమోషనల్ డ్రామా.అయితే ఇది ఫూర్లీ వరుణ్ జర్నీ .
- తెలుగులో తొలిసారి ప్రొఫెషనల్ బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న చిత్రం గని.మిక్స్ మార్షల్ ఆర్ట్స్ లో చాలా సినిమాలు వచ్చాయి కానీ..నాకు తెలిసి ఇండియాలో ప్రో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు గురు,తుఫాన్ తరువాత మన తెలుగు సినిమా "గని".
 
-- బాక్సింగ్ లో రియాలిటీ ఉండాలని యూఎస్ లో ఉండే ఒలింపిక్ మెడల్ విన్నర్ టోనీ జఫ్రీస్ దగ్గర బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాడు.ఆ తరువాత ఇండియాలో నీరజ్ గోయల్ గారి దగ్గర కూడా ట్రైన్ అవ్వడం జరిగింది.
- ఫస్ట్ షెడ్యూల్ మొదలు పెట్టగానే  కరోనాతో ఆగింది. వరుణ్,అరవింద్ గార్లు మాకెంతో  ధైర్యాన్ని, సపోర్ట్ ఇచ్చారు.
- బాక్సింగ్ సన్నివేశాల కోసం భారీ స్థాయిలో రెండు సార్లు సెట్స్ చేశాను.
- కథను చెప్పిన విధంగానే కిరణ్ తెర పైకి తెచ్చాడు. వరుణ్ సలహాతో గని టైటిల్ పెట్టాం.
- నిర్మాతగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని సొంత బ్యానర్ లో సినిమాలు తీస్తున్నాను.
- వరుణ్ తేజ్ బుజానికి గాయం అయినా కూడా..ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. వరుణ్ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది.
 
-- 5 సంవత్సరాల క్రితం ఈ సినిమాను మొదలు పెట్టాము. అప్పుడు మేము పాన్ ఇండియా విజన్ తో ఈ సినిమా స్టార్ట్ చేయలేదు.
--కథకు అవసరం అయ్యినందున ఉపేంద్ర గారు, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా వంటి సీనియర్లు నటించారు. వీరందరూ అద్బుతంగా నటించారు. వారు యాక్ట్ చేసినందుకే అందరూ పాన్ ఇండియా సినిమా అంటున్నారు.
-- ప్రస్తుతం తెలుగు, కన్నడలో మాత్రమే విడుదల చేస్తున్నాము. చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది.
 
-- వరుణ్ 'గద్దల కొండ గణేష్' చేసినందున మాకు రెండక్షరాల టైటిల్ వుంటే బాగుంటుందని "గని" అనుకున్నాము. ప్రేక్షకులకు కూడా చెప్పడానికి మంచి సౌండింగ్ ఉంటుందని ఈ టైటిల్ ని ఒకే చేశాము.
-త్వరలో web series నిర్మించనున్నా.
- నాన్న గారి సలహాలు చాలా ఉపయోగపడ్డాయి. మాకు అన్ని విధాలా అండగా నిలిచారు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments