అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ సినిమా మార్కెటింగ్‌లో వున్నాడు. ఆహా! వంటి ఓటీటీ బాధ్యతలను ఆల్ లైన్ టికెట్ వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలు కూడా ఆయన నిర్వర్తిస్తున్నాడు. ఈ సందర్భంగా ఎ.పి.లో ఆన్‌లైన్ టికెట్ల వ్యవహారం బాధ్యతను అల్లు బాబీకే అప్పగించనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆయన కొట్టిపారేయలేదు. అవసరం వచ్చినప్పుడు తానే వెల్లడిస్తానని అన్నారు.
ఆయన నిర్మాతగా వరుణ్ తేజ్ కథానాయకుడిగా `గని` సినిమాను నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను దాదాపు 15 సంవత్సరాలుగా సినిమా రంగానికే చెందిన వ్యాపారంలో ఉన్నానని, జస్ట్ టిక్కెట్స్ పేరుతో ఆన్ లైన్ టిక్కెటింగ్ కంపెనీని నిర్వహిస్తున్నానని చెప్పారు. అలానే సినిమాలను శాటిలైట్ ద్వారా థియేటర్లకు అందించే క్యూబ్ సంస్థను కూడా తానే నడుపుతున్నానని అన్నారు. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ నిర్వహణలోనూ బాబీ తలమునకలై ఉన్నారు. త్వరలో ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థను ఎఫ్.డి.సి. ద్వారా అందించాలని అనుకుంటోంది. అందుకోసం బిడ్స్ ను ఆహ్వానించింది. దానిలో అల్లు బాబీకి చెందిన జస్ట్ టిక్కెట్స్ సంస్థ కూడా పాల్గొంది. తెలిసిన సమాచారం మేరకు ఇదే సంస్థకు ఆన్ లైన్ టిక్కెటింగ్ బాధ్యతలను ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతోందని తెలుస్తోంది. అయితే అధికారిక సమాచారం వచ్చేవరకూ తాను ఈ విషయంపై స్పందించలేనని బాబీ అన్నారు.