Webdunia - Bharat's app for daily news and videos

Install App

''గమనం''.. స్పెషల్ రోల్‌లో నిత్యామీనన్.. శైలపుత్రి ఫస్ట్ లుక్ అదుర్స్

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (14:58 IST)
Shailaputri Devi
సీనియర్ నటి శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్న ''గమనం''. సుజనా రావు దర్శకత్వం వహిస్తున్న ఈ రియల్ లైఫ్ డ్రామాలో నిత్యా మీనన్ కూడా స్పెషల్ రోల్‌లో కనిపించనుంది. ఈ చిత్రంలో శాస్త్రీయ సంగీత గాయని శైలాపుత్రి దేవిగా నిత్య కనిపించనుంది. తాజాగా నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని యువ హీరో శర్వానంద్ విడుదల చేసారు. ఈ పోస్టర్‌లో నిత్య ప్రత్యేకంగా సాంప్రదాయమైన వస్త్రధారణలో సంగీత కచేరి చేస్తున్నట్లు కనిపిస్తోంది.
 
ఇటీవల విడుదలైన శ్రీయా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. డీ గ్లామరస్ రోల్‌లో శ్రియాని చూసి అందరూ షాక్ అయ్యారు. అప్పటినుంచి ఈ సినిమా మీద ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా మేకర్స్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు. 
 
కాగా ''గమనం'' చిత్రం తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో పాన్ ఇండియా ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు రాస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న జ్ఞానశేఖర్ వి.ఎస్. నిర్మాత అవతారం ఎత్తి రమేష్ కరుటూరి - వెంకీ పుషడపులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయిన 'గమనం' చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Newly married woman: పెళ్లైన మూడు రోజులకే నవ వధువు మృతి.. ఎలా.. ఏం జరిగింది?

రిజర్వేషన్ వ్యవస్థ అప్‌గ్రేడ్- నిమిషానికి లక్ష కంటే ఎక్కువ టిక్కెట్లు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాఠశాలలకు రూ.45.02 కోట్లు మంజూరు

ప్రైవేట్ బస్సులో నేపాలీ మహిళపై అత్యాచారం... ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments