రజినీకాంత్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలు సృష్టించి అభిమానుల గుండెల్లో స్థానాన్ని చోటుచేసుకున్నారు. అయితే తాజాగా కరోనా కారణంగా తన వీరాభిమాని మురళి ముంబైలోని ఆస్పత్రిలో చేరారు. అతని ఆరోగ్యం విషమంగా మారింది.
ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా రజనీకాంత్ గురించి ఇలా రాసుకొచ్చాడు మురళి. 2021లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలిచి అత్యుత్తమ నాయకుడుగాను, ఒక తండ్రిగా, ఆధ్యాత్మిక గురువుగా రాజ్య మార్గాన్ని ఏర్పరచి గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి వ్యక్తికి రూ.25 వేలు ఆదాయం వచ్చే పరిస్థితిని తీసుకొని రావాలని విన్నవించాడు. నీ సారథ్యంలో నడిచే సేవలు నేను అందించలేకపోతున్నానని బాధపడుతున్నానని పేర్కొన్నాడు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో తన అభిమాని ఉన్నాడని తెలుసుకున్న రజనీకాంత్ తన అభిమానికి ధైర్యాన్ని ఇచ్చే సందేశాన్ని పంపాడు. నీకేం కాదు, ధైర్యంగా ఉండు. అనారోగ్యం నుంచి త్వరలోనే కోలుకుంటావు. తరువాత కుటుంబ సమేతంగా మా ఇంటికి రండి. నేను నిన్ను చూస్తాను అని వాయిస్ నోట్ పంపించారు.
ఇక లాక్ డౌన్ సమయం కావడంతో సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు రజినీ. త్వరలోనే ప్రారంభించనున్న రాజకీయ పార్టీ గురించి చర్చలు జరుపుతున్నారు. నవంబర్ లోపు రజనీకాంత్ తన పార్టీని ప్రారంభిచనున్నారని తెలుస్తోంది. అటు సినిమా చర్చల్లో కూడా రజనీకాంత్ బిజీగా ఉన్నారు.