Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

డీవీ
శనివారం, 31 మే 2025 (12:21 IST)
తెలంగాణ గద్దర్ సినిమా పదేళ్ల పురస్కారాలు
NTR అవార్డు నందమూరి బాలకృష్ణ
కాంతారావు అవార్డు విజయ్ దేవరకొండ
 
మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు. ఒక్కటే టార్గెట్ సినీ ఇండస్ట్రీ అంతా గద్దర్ పురస్కారాల ప్రదానోత్సవంలో కనిపించాలి. అంతే, జ్యూరీ సినిమాలు చూడకుండానే గత పదేళ్లు 30 సినిమాలను ఎంపిక చేసి పడేసారు. నీకు నీకు నీకు అంతే. గతంతో పోల్చుకుంటే బహుమతుల నగదు కూడా భారీగా పెంచేసారు.
 
కోటిన్నర పైగా నగదు పురస్కారాల బహుమతులకే ఖర్చు చేస్తున్నారు. హైటెక్స్ నాలుగో హాలుకు పది లక్షలు రెంట్.  జూన్ 14న అట్టహాసంగా తెలంగాణ గద్దర్ సినిమా అవార్డుల ప్రదానోత్సవం జరగనున్నది. మొత్తానికి మూడు కోట్ల రూపాయల సినీ సంబరం ఇది. 
 
NTR నేషనల్ అవార్డు - పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ
కాంతారావు అవార్డు - విజయ్ దేవరకొండ
రఘుపతి వెంకయ్య అవార్డు - యండమూరి వీరేంద్రనాథ్
పైడి జయరాజ్ అవార్డు - మణిరత్నం
బి.యన్.రెడ్డి అవార్డు - సుకుమార్ నాగిరెడ్డి
చక్రపాణి అవార్డు - అట్లూరి పూర్ణచంద్రరావు
 
2014 నుంచి 2023 వరకు సంవత్సరానికి మూడు ఉత్తమ సినిమాలను మురళీమోహన్ అధ్యక్షతన ఎంపిక చేశారు. 
2014 : రన్ రాజా రన్, పాఠశాల, అల్లుడు శ్రీను
2015 : రుద్రమదేవి, కంచె, శ్రీమంతుడు
2016 : శతమానం భవతి, పెళ్ళి చూపులు, జనతా గ్యారేజ్
2017 : బాహుబలి 2, ఫిదా, ఘాజీ
2018 : మహానటి, రంగస్థలం, కేరాఫ్ కంచరపాలెం
2019 : మహర్షి, జెర్సీ, మల్లేశం
2020 : అల వైకుంఠ పురంలో, కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలడీస్
2021 : RRR, అఖండ, ఉప్పెన
2022 : సీతారామం, కార్తికేయ 2, మేజర్
2023 : బలగం, హనుమాన్, భగవంత్ కేసరి
స్పెషల్ జ్యూరీ అవార్డు - ప్రజాకవి కాళోజీ

సంతోషకరమైన విషయం ఒక్కటే. గత 12 ఏళ్లుగా నంది పురస్కారాలు లేవు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నందిని అవార్డ్స్ పేరు మార్చి గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇవ్వడం సంతోషించదగిన విశేషమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆడుదాం ఆంధ్రా స్కామ్‌పై విచారణ పూర్తి : తొలి అరెస్టు మాజీ మంత్రి రోజానేనా?

పిఠాపురంలో వితంతువులకు చీరలు పంచిన పవన్ కళ్యాణ్

13న బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వర్షాలు

నేటి నుంచి తెలంగాణాలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments