తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంట్రీలు వచ్చిన సినిమాలను చూసి జ్యురి మెంబర్స్ నేడు గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. FDC చైర్మన్ దిల్ రాజు, జయసుధ నేతృత్వంలోని జ్యురి ఈ అవార్డులను నిర్ణయించింది. 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులను జూన్ 14న 
హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రదానం చేస్తామని దిల్ రాజు అన్నారు.
  
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
									
										
										
								
																	ఇంకా ఆయన మాట్లాడుతూ, అవార్డు కమిటీ ఎంపికచేసిన తర్వాత వారి మనస్సాక్షికి లోబడి అవార్డుల ఎంపిక చేయమని చెప్పాను. వారి నిన్న రాత్రి నాకు లిస్ట్ ఇస్తుంటేవారి ముఖంలో సంతోషం చూశాను. నేను ఆ లిస్ట్ ను రేవంత్ రెడ్డిగారికి సమర్పించాను. నేడు ప్రకటిస్తున్నాం. దాదాపు 14 ఏళ్ళ తర్వాత అవార్డులు ప్రదానం చేస్తున్నారు. 
2024కు ముందు నుంచి అవార్డులు ఇవ్వాలి. అవి కూడా రెడీగా వున్నాయి. రేపు, ఎల్లుండే వాటిని ప్రకటిస్తామని దిల్ రాజు చెప్పారు.
  
									
										
								
																	
	 
	జ్యూరీ కమిటీ ఛైర్మన్ గా జయసుధ అవార్డులను ప్రకటించింది. ఈసారి చాలా మంది కొత్త దర్శకులు ఇందులో వున్నారు. కొత్త టాలెంట్ చూసి ఆనందం వేసింది. అలాగే కమేడియన్లుగా ఇద్దరికీ, బాలనటులుగా ఇద్దరికీ కలిపి అవార్డులు ఇస్తున్నాం అన్నారు.
 
									
											
									
			        							
								
																	
	ఉత్తమ చిత్రం- కల్కి 2898AD
	ఉత్తమ రెండవ చిత్రం – పొట్టెల్
	ఉత్తమ మూడవ చిత్రం – లక్కీ భాస్కర్
 
									
					
			        							
								
																	
	ఉత్తమ నటుడు – అల్లు అర్జున్(పుష్ప 2)
	ఉత్తమ నటి – నివేదా థామస్ (35)
	ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్(కల్కి)
 
									
					
			        							
								
																	
	నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం – కమిటీ కుర్రోళ్ళు
	బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం – 35 ఇది చిన్న కథ కాదు
 
									
					
			        							
								
																	
	ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ – రజాకార్
	బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ – యదు వంశీ(కమిటీ కుర్రోళ్ళు)
 
									
			                     
							
							
			        							
								
																	
	ఉత్తమ ప్రజాదరణ చిత్రం – ఆయ్
	బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – SJ సూర్య(సరిపోదా శనివారం)
	బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – శరణ్య ప్రదీప్(అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
 
									
			                     
							
							
			        							
								
																	
	బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – భీమ్స్ సిసిరోలియో(రజాకార్)
	బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ – సిద్ శ్రీరామ్(ఊరుపేరు భైరవకోన – నిజమే చెబుతున్న సాంగ్)
 
									
			                     
							
							
			        							
								
																	
	బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ – శ్రేయ ఘోషల్(పుష్ప 2 – సూసీకి సాంగ్)
	బెస్ట్ కమెడియన్ – సత్య, వెన్నెల కిషోర్(మత్తు వదలరా)
 
									
			                     
							
							
			        							
								
																	
	బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – మాస్టర్ అరుణ్ దేవ్(35 ఇది చిన్నకథ కాదు) మాస్టర్ హారిక(మెర్సీ కిల్లింగ్)
 
									
			                     
							
							
			        							
								
																	
	బెస్ట్ స్టోరీ రైటర్ – శివ పాలడుగు(మ్యూజిక్ షాప్ మూర్తి)
	బెస్ట్ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లూరి(లక్కీ భాస్కర్)
 
									
			                     
							
							
			        							
								
																	
	బెస్ట్ లిరిసిస్ట్ – చంద్రబోస్(రాజు యాదవ్)