Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్ సాయం చేయరూ... ఆస్పత్రిలో బిల్లు కట్టలేని దుస్థితిలో టాలీవుడ్ హీరోయిన్

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (10:10 IST)
కోలీవుడ్ సెలబ్రిటీల జీవితాల పైకి చూసేందుకు పూలపాన్పులా కనిపిస్తాయి. నిజ జీవితాల్లో మాత్రం అనేక చీకటి కోణాలు ఉంటాయి. అనేక విషాధ గాథలు కూడా ఉన్నాయి. ఒకపుడు ఎంతో మంది స్టార్ హోదాను అనుభవించిన హీరో హీరోయిన్లు.. ఇపుడు తినడానికి తిండిలేక ఇతరు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటివారిలో ఒకరు హీరోయిన్ విజయలక్ష్మీ. ఈమె గతంలో హీరో వేణుకు జోడీగా నటించింది. అలాగే, హనుమాన్ జంక్షన్‌లో హీరోలు అర్జున్, జగబతిబాబులకు చెల్లిగా నటించింది. 
 
ప్రస్తుతం ఈ హీరోయిన్ ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇటీవల విజ‌య‌ల‌క్ష్మీ ఇటీవ‌ల తీవ్ర అనారోగ్యానికి గురైంది. త‌న ద‌గ్గ‌ర ఉన్న మొత్తం సొమ్ముని ఆసుప‌త్రిలోనే ఖ‌ర్చు చేయ‌డం వ‌ల‌న ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తుంది. అయితే రీసెంట్‌గా త‌న బీపీ లెవ‌ల్స్ మ‌రింత‌గా పెరిగిపోవ‌డంతో బెంగుళూరులోని మల్లయ్య హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. 
 
ప్రస్తుతం ఆమెకు ఐసీయులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా.. మరికొన్నాళ్లు చికిత్స చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం తాను హాస్పిటల్ బిల్లు క‌ట్ట‌లేని స్థితిలో ఉందనీ, ఎవరైనా ఆర్థిక సాయం చేయాలని కోరుతోంది. ఈ మేరకు, విజ‌య‌ల‌క్ష్మీ చెల్లెలు ఉషాదేవి సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు మా అక్క‌ని ఆదుకోవాల‌ని కోర‌గా పలువురు సినీ పెద్దలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments