Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకుల పల్స్‌ తెలిసిన దర్శకులు కొందరేనా!

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (13:34 IST)
bedurulanka2012
ఇటీవల ఎంత పెద్ద సినిమా అయినా ప్రేక్షకులకు నచ్చకపోవడానికి కారణం చాలా కారణాలు వుంటున్నాయి. కొన్ని సినిమాలు ఎందుకు హిట్టవుతాయో, మరికొన్ని ఎందుకు ఫట్‌ అవుతాయో తెలీదు. ఇటీవలే ఒకేరోజు విడుదలైన కార్తికేయ నటించిన బెదురులంక 2012, వరుణ్‌తేజ్‌ నటించిన గాంఢీవధారి అర్జున, హాస్టల్‌ బాయ్స్‌ అనే డబ్బింగ్‌ సినిమా వున్నాయి. అయితే రిలీజ్‌ రోజే డిజాస్టర్‌ టాక్‌ రావడంతో గాంఢీవధారి అర్జునకు థియేటర్‌లో జనాలు పెద్దగా లేరు. కానీ బెదురులంక 2012 సినిమా పూర్తి వినోదభరితంగా తీయడంతో థియేటర్‌లలో ఇప్పటికీ హౌస్‌ఫుల్స్‌ కావడం విశేషం.

Gandhiwadhari Arjuna
గతంలో వచ్చిన యుగాంతం కాన్సెప్ట్‌ తరహాలో ఈ సినిమాను పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌లో తీశారు. వెన్నెల కిశోర్‌తోపాటు మరికొంతమంది కమేడియన్స్‌ ఇందులో వుండడంతో వారే సినిమాను నడిపారనే చెప్పాలి. మరోవైపు హీరో కార్తికేయ కూడా వేసిన పంచ్‌లు బాగా పేలాయి. వెరసి ఈ సినిమా దర్శక నిర్మాతలకు మంచి పేరును తెచ్చిపెట్టింది.
 
ఇక కన్నడ సినిమా తెలుగులో  బాయ్స్‌ హాస్టల్‌గా విడుదలైంది. ఇందులో రష్మిక గౌతమి ఎపిసోడ్‌ సెపరేట్‌గా చిత్రీకరించారు. లెక్చరర్‌గా ఆమె నటించింది. మరోవైపు గ్లామర్‌తో అందాలతో అలరించింది. హాస్టల్‌ వార్డెన్‌ను అనుకోకుండా బాయ్స్‌ చంపేస్తారు. అది ఎందుకు? ఎలా? అనేది పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో చూపించడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు.
 
ఇక ప్రవీణ్‌ సత్తారు తన దర్శకత్వంలో చేసిన గాంఢీవదారి అర్జున సినిమా అటూ,ఇటూ కాకుండా పోయింది. సినిమాటోగ్రఫీ, సంగీతపరంగా మినహా కథలో సామాన్యుడికి పనికివచ్చే అంశం లేకపోవడం పధాన లోపం. దేశంలో అందరూ ఎదుర్కొంటున్న పర్యావరనణ కాలుష్యం, మానవుని జీవితంలో రానురాను ఏవిధంగా నాశనం చేస్తుందనేది చెప్పేక్రమంలో ఎక్కువ భాగం హింస ఎక్కువ కావడంతో పక్కదోవ పటిందని ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు. ఏదో మంచి సందేశం ఇవ్వాలని చూసిన దర్శక నిర్మాతలకు ఇది పెద్ద బ్రేక్‌పడింది. అందుకే ఒక్కోసారి మన ఆలోచలనకు ప్రేక్షకులు అందరు అని ప్రవీణ్‌ సత్తార్‌ ఓ సందర్భంగా అనడం విశేషం. ఏదిఏమైనా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ప్రేక్షకులకు ఇప్పుడు కావాల్సింది కేవలం  వినోదమే. అంతకుముందు ఏదైనా చెబితే వారికి క్లాస్‌పీకినట్లుంటుందని తెలియజేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వర్క్ ఫ్రంమ్ హోం కాదు.. వర్క్ ఫ్రమ్ కారు : వీడియో వైరల్ - షాకిచ్చిన పోలీసులు

బర్డ్ ఫ్లూ సోకినా పట్టింపు లేదు.. హైదరాబాదులో తగ్గని చికెన్ వంటకాల వ్యాపారం

ఏపీలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ - ఏలూరులో మనిషికి వైరస్ సోకింది!!

పర్యాటకులకు శుభవార్త : చెన్నై - విశాఖ - పుదుచ్చేరిల మధ్య క్రూయిజ్ నౌక

నేను చాలా గలీజ్... నేను ఇపుడే వస్తా : సీఐ శ్రీనివాస్ - లావణ్య ఫోను ముచ్చట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments