Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెదురులంక 2012 సినిమా మనిషిగా నన్ను మార్చింది : హీరో కార్తికేయ

Karthikeya, Neha Shetty, LB Sriram
, గురువారం, 24 ఆగస్టు 2023 (13:39 IST)
Karthikeya, Neha Shetty, LB Sriram
కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా 'బెదురులంక 2012'. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 25న) సినిమా విడుదల కానుంది. హైదరాబాద్‌లో బుధవారం రాత్రి ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.
 
హీరో కార్తికేయ మాట్లాడుతూ ''నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లు, సినిమాలు వేరు. 'బెదురులంక 2012' వేరు. 'ఆర్ఎక్స్ 100'తో ఒకసారి ఇంట్రడ్యూస్ అయ్యాను. మళ్ళీ ఇంకోసారి 'బెదురులంక 2012'తో అవుతున్నాను. రెండిటిలో శివ పేరు కుదిరింది. క్లాక్స్ కథ చెప్పినప్పుడు ఇందులో నా క్యారెక్టర్, హీరోయిజం ఎంత ఉంది? మార్కెట్ ఎలా ఉంది? వంటి లెక్కలు వేసుకోలేదు. కథ వినగానే నేను ఎంజాయ్ చేసినట్లు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తే బావుంటుందని అనిపించింది. ఆరు గంటలకు క్లాక్స్ కథ చెప్పడం మొదలు పెడితే రాత్రి 12 అయ్యింది. ఈ కథను ఆడియన్స్ 100 పర్సెంట్ ఎంజాయ్ చేస్తారని, ఆలోచిస్తారని అనిపించింది. జీవితంపై క్లాక్స్ కు ఉన్న క్లారిటీ సినిమాలో కనిపిస్తుంది. మా వేవ్ లెంగ్త్స్ మ్యాచ్ అయ్యాయి. ఈ సినిమా చేస్తున్న క్రమంలో మనిషిగా నేను కూడా మారాను. ఆ మార్పు ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇందులో వేరేగా ఉన్నానని ప్రేక్షకులకు అనిపిస్తుంది. ఇటువంటి కథను నాతో సినిమా చేయడానికి నిర్మాత నమ్మాలి. నాతో లవ్ స్టోరీ, యాక్షన్ సినిమా చేయడానికి నిర్మాతలు వస్తారు.అని అన్నారు.         
 
దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ''బెన్నీ గారు సెన్సిబుల్ కథలు ఎంపిక చేస్తారని అందరూ చెప్పారు. నేను సెన్సిబుల్ కథ రాస్తే సరిపోదు. దాన్ని గుర్తించి, అర్థం చేసుకోవాలనే వ్యక్తి కావాలి. నేను ఈ కథను 7, 8 ఏళ్లుగా చాలా మంది నిర్మాతలకు చెప్పా. వాళ్ళందరూ ఏవేవో చూశారు. బెన్నీ గారికి చెప్పినప్పుడు కోర్ పాయింట్ అర్థం చేసుకున్నారు. నేను చాలా మంది హీరోలకు కూడా కథ చెప్పా. తమకు తగ్గట్టు మార్చమని అడిగారు. కార్తికేయకు కథ చెప్పినప్పుడు బెన్నీ గారిలా కథను అర్థం చేసుకున్నారు. కార్తికేయ లాంటి హీరో, బెన్నీ గారి లాంటి నిర్మాత దొరకడం అదృష్టం. మంచి టీమ్ కుదిరింది. మణిశర్మగారి సంగీతం, వినోద్‌ గారి సౌండ్‌ డిజైనింగ్‌ అద్భతం'' అని అన్నారు. 
 
హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ,  'డీజే టిల్లు'లో తెలంగాణ అమ్మాయి రాధికను చూశారు. ఇప్పుడు 'బెదురులంక 2012'లో ఆంధ్ర అమ్మాయి చిత్రను చూడబోతున్నారు. నేను ఎగ్జైటెడ్ గా ఉన్నాను. మంచి సినిమాలో నేను భాగం అయినందుకు సంతోషంగా ఉంది. పల్లెటూరి అమ్మాయిగా నటించగలనా? లేదా? అని దర్శకుడు క్లాక్స్ సందేహించినా... నిర్మాత బెన్నీ గారు సజస్ట్ చేశారు. అని అన్నారు. 
 
చిత్ర నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ... ''హీరో కార్తికేయ చాలా ప్రొఫెషనల్. క్లాక్స్ కొత్త కథను చెప్పాడు. మంచి సినిమా చేశామనే సంతోషం ఉంది'' అని అన్నారు.
 
ప్రముఖ నటులు ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ ''మంచి క్యారెక్టర్స్ కోసం ఏడాది గ్యాప్ తీసుకుందామని షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టాను. అక్కడ బిజీ అయిపోయా. ఇక్కడ నా స్నేహితులు వెళ్ళిపోయారు. ఆ సమయంలో దర్శకుడు క్లాక్స్ ఈ కథతో వచ్చారు. మంచి క్యారెక్టర్, పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. వెండితెరకు దూరం కాకూడదని మళ్ళీ క్యారెక్టర్లు చేయడం మొదలుపెట్టా'' అని అన్నారు. 
 
నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ, . క్లాక్స్ ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. మనుషుల్లో బలహీనతలు, స్వార్థం, దిగజారుడు తనం సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది ఆయన స్టైల్ లో ఈ సినిమాలో చూపించాడు. అద్భుతమైన కథ. ఇది ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా. ఇందులో ముఖ్యమైన క్యారెక్టర్ చేశా'' అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా నటించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ స్పార్క్L.I.F.E