Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యామిలీ స్టార్ హిట్టా ఫట్టా? కంప్లైంట్ చేస్తానన్న విజయ్ దేవరకొండ

ఐవీఆర్
గురువారం, 11 ఏప్రియల్ 2024 (16:27 IST)
రూ. 50 కోట్ల బడ్జెట్టుతో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరో. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది కానీ ఆ తర్వాత క్రమంగా వసూళ్లు వేగంలో తగ్గుదల కనిపించింది. సినిమాపై కొందరు పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేసారంటూ హీరో విజయ్ దేవరకొండ ఆగ్రహం వ్యక్తం చేసారు. సోషల్ మీడియాలో తమ చిత్రంపై ఎవరైతే నెగటివ్ ప్రచారం చేసారో వారిపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
 
ఇదిలావుంటే ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు. ఆయన చిత్ర నిర్మాణంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. కనుక చిత్రానికి రూ. 50 కోట్లు ఖర్చుపెట్టినట్లు సినీ వర్గాల సమాచారం. ఐతే ఇప్పటివరకూ ఫ్యామిలీ స్టార్ కేవలం రూ. 28 కోట్లను మాత్రమే వసూలు చేసింది. పెట్టింది రావాలంటే మరో 22 కోట్లు లాగాలి. పరిస్థితి చూస్తుంటే అలా లేదంటూ కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం సినిమా విడుదలైన మొదటి వారంలోనే అనేక స్క్రీన్‌ల నుండి ఈ చిత్రాన్ని తొలగించేసారట.
 
కాగా గతంలో పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన గీతగోవిందం బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నది. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం నుంచి రౌడీ హీరో ఖాతాలో సరైన హిట్ పడలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments