Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవకాశాలు రావు.... మనమే సృష్టించుకోవాలి : కృతిసనన్

Advertiesment
kriti sanon

వరుణ్

, గురువారం, 11 ఏప్రియల్ 2024 (16:07 IST)
ఏ రంగంలోనూ మనకంటూ ప్రత్యేకంగా అవకాశాలు వెతుక్కుంటూ రావని మనమే సృష్టించుకోవాలని బాలీవుడ్ నటి కృతిసనన్ అన్నారు. తాజాగా ది క్రూ చిత్రంతో ఆమె విజయాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ, అవకాశాలు రాకపోతే సృష్టించుకోవాలని కోరారు. ఈ యేడాది ఇప్పటికే రెండు హిట్‌లను తన ఖాతాలో వేసుకున్న కృతి 'దో పత్తి' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
 
'నాకు ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయత్నించడం ఇష్టం. సినీ రంగంలో నేర్చుకోవడానికి ఎన్నో అంశాలున్నాయి. కొన్నిసార్లు మనం కోరుకున్న అవకాశాలు రాకపోతే.. మనమే సృష్టించుకోవాలి. అందుకే నేను నిర్మాతగా మారాను. నేను  ఏది చేసినా ప్రత్యేకంగా ఉండాలనుకుంటాను. సినిమా అవకాశం వచ్చినా స్క్రిప్ట్‌ మొత్తం ఉత్సాహంగా చదువుతాను. సినీరంగంలోకి వచ్చినప్పుడే ఏదో ఒకరోజు నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నా. 'మిమి' షూటింగ్‌ సమయంలోనే 'దోపత్తి' స్క్రిప్ట్‌ విన్నాను. నా హృదయానికెంతో దగ్గరైంది. అది ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. కథ విన్నాక  కొన్ని మార్పులు చేశాం. ప్రాణం పెట్టి పనిచేశాం. నేను పూర్తి బాధ్యతలు తీసుకున్న తొలి చిత్రమిది. నిర్మాతగా నాకు చాలా తృప్తినిచ్చింది' అన్నారు.
 
'ఏ సినిమాకైనా కంటెంటే కింగ్‌. నేను దాన్నే నమ్ముతాను. ఏదైనా కథను ప్రేక్షకురాలిగా చదువుతాను. నచ్చితే ఆ సినిమాకు వెంటనే ఓకే చెబుతాను. చేసిన పాత్రలనే చేయడం నచ్చదు. విభిన్నమైన పాత్రలు, జానర్లలో నటించాలి. స్వచ్ఛమైన ప్రేమ కథలో నటించాలని ఉంది. కామెడీ చిత్రాలన్నా ఆసక్తి ఎక్కువే. కొన్నిసార్లు మన జీవితాల్లో జరిగే సంఘటనలు కూడా చాలా ఫన్నీగా అనిపిస్తాయి. అలాంటివి సినిమాల్లో ఉంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. నటిగా, నిర్మాతగా వాళ్లకు వినోదాన్ని పంచడమే నా లక్ష్యం' అని కృతి సనన్ చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వచ్చమైన తెలుగింటి టైటిల్ సఃకుటుంబానాం ఫస్ట్ లుక్