Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫ్2 అదరగొడుతోంది.. రూ.140 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌తో సరికొత్త రికార్డు..

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (12:15 IST)
సంక్రాంతికి దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్‌ హీరోలుగా నటించిన 'ఎఫ్2' సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైయింది. పటాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన అనీల్ రావిపూడి ఎఫ్ 2 చిత్రాన్ని కూడా మంచి వినోదం అందించే చిత్రంగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు.


జనవరి 11న విడుదలైన ఈ చిత్రం ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుంది. 106 సెంటర్స్‌లో ప్రస్తుతం ఎఫ్ 2 చిత్రం సక్సెస్ ఫుల్‌గా నడుస్తుండగా, కొన్ని చోట్ల ఇప్పటికి థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయట.
 
శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌లో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, అనసూయ, హరితేజ, సుబ్బరాజు, రఘబాబు, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, అన్నపూర్ణ, హరితేజ తదితరులు కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు సీక్వెల్ రానుంది.
 
ఈ సినిమాకి పోటీగా విడుదలైన 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'వినయ విధేయ రామ' 'పేట' సినిమాలు రేసులో లేకుండా పోయాయి. వెంకటేష్‌, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రలలో అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌ని రాబడుతుంది.
 
తాజాగా ఈ సినిమా రూ.140 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌తో సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల రారాజుగా నిలిచింది. సౌత్ ఇండియాలో 140 కోట్ల గ్రాస్ సాధించిన తొలి మల్టీ స్టారర్ మూవీగాను ఈ సినిమా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments