Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయోగాత్మక చిత్రం రా రాజా వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్

దేవి
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (16:51 IST)
Ra Raja poster
ఇండియన్ స్క్రీన్ మీద ఇది వరకు రాని ఓ కొత్త సబ్జెక్ట్.. ఎవ్వరూ టచ్ చేయని ఓ ప్రయోగంతో ఓ చిత్రం రాబోతోందని చిత్ర యూనిట్ చెపుతోంది. అసలే ఇప్పుడు యంగ్ డైరెక్టర్లు అంతా కూడా కొత్త కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారు. మొహాలు కనిపించుకుండా ఓ ట్రైలర్‌ను కట్ చేయడం అన్నది ఎలాంటి టెక్నీషియన్‌కు అయినా కష్టమే. అలాంటి ఓ విభిన్న ప్రయోగాన్ని ‘రా రాజా’ టీం చేసింది.

శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ దర్శకత్వంలో ‘రా రాజా’ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. 
 
రోమాలు నిక్కబొడుచుకునేలా, వెన్నులో వణుకు పుట్టేలా కట్ చేసిన ‘రా రాజా’ ట్రైలర్‌ను ఇది వరకే అందరం చూశాం. ఓ కెమెరామెన్ బ్రిల్లియన్స్, ఓ డైరెక్టర్ కొత్త విజన్, ఓ మ్యూజిక్ డైరెక్టర్ పనితనం ఆ ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఒక్క యాక్టర్ మొహం కూడా చూపించకుండా కట్ చేసిన తీరు అద్భుతంగా ఉంటుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్, రాహుల్ శ్రీ వాత్సవ్ కెమెరా యాంగిల్స్‌తోనే అందరినీ భయపెట్టేశారు. ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇంత వరకు సినిమా రాలేదు. అసలు ఇలాంటి ట్రైలర్‌ను ఇంత వరకు ఇండియన్ సినీ హిస్టరీలోనే చూసి ఉండరు.
 
ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ జనాల్లో మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. ఇక త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పళనిలో పవన్ కల్యాణ్.. తిరుపతి-పళనికి బస్సు సర్వీసులు పునఃప్రారంభం (video)

Chittoor To Prayagraj- మహా కుంభమేళాకు సీఎన్‌జీ ఆటోలోనే వెళ్లిన ఏపీ యువకులు

వంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్.. ట్రెండ్ అవుతున్న వీడియోలు

రూ.7 కోట్ల ప్యాకేజీ.. ప్చ్.. భార్య విడాకులు అడుగుతోంది.. జీవితంలో ఓడిపోయా!!

జగన్ 2.0.. ఇంత లైట్‌గా తీసుకుంటే ఎలా..? బెంగళూరుకు అప్పుడప్పుడు వెళ్లాలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments