Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రంగస్థలం తర్వాత నేను చూసిన సినిమా పొట్టేల్ : డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga, Ajay and others

డీవీ

, మంగళవారం, 22 అక్టోబరు 2024 (15:44 IST)
Sandeep Reddy Vanga, Ajay and others
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా 'పొట్టేల్'. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. 'పొట్టేల్' అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.  డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.  
 
సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ఈ కథ విన్నాను. చిన్న కథ చేసుకున్నానని సాహిత్ చెప్పాడు. కథ విన్నాక..ఇది చిన్న కథ కాదు చాలా పెద్ద కథ అనిపించింది. నేను సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. రెండు పాటలు చాలా బాగా నచ్చాయి. ట్రైలర్ కూడా చాలా బాగుంది. అజయ్ గారు సినిమా అంతా భయపెట్టించి వదిలారు. యువ, అనన్య, నోయల్ జీవ అందరు సూపర్ గా యాక్టింగ్ చేశారు. సాహిత్ ఇంత అద్భుతంగా తీస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. సాహిత్ చిన్న కథ అన్నాడు కానీ నాకు చాలా పెద్ద బడ్జెట్ కనిపించింది. ఎలా తీస్తాడు అనుకున్నాను. ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషన్ తో సినిమా తీశారు. సినిమా చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుంది. న్యూ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇటీవల యంగ్‌ డైరెక్టర్లు ఎవరూ ఇలా పూర్తిస్థాయి రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయలేదనుకుంటున్నా. ఆ బ్యాక్‌డ్రాప్‌లో ‘రంగస్థలం’ తర్వాత నేను చూసిన సినిమా ఇదే. అందరికీ ఆల్ ది బెస్ట్. దిస్ ఫిలిం విత్ బిగ్ హార్ట్. చిన్న సినిమాని అందరూ ఎంకరేజ్ చేయండి. థాంక్యూ' అన్నారు
 
హీరో యువ చంద్ర మాట్లాడుతూ,  ఒక్క అవకాశం వస్తే చాలు దేవుడా.. అనుకున్న సమయంలో వచ్చిన అవకాశం పొట్టేల్.  నా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. చిరంజీవి గారికి ఏకలవ్య శిష్యుడిని. గ్యాంగ్ లీడర్ చూసి డాన్స్ చేయడం స్టార్ట్ చేశాను. పొట్టేల్ మూవీ  ప్రాపర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ. ఇందులో ఎమోషన్ ఆడియన్స్ మనసుల్ని కదిలించేలా ఉంటుంది. మా సినిమా తప్పకుండా మీ మనసులో ఉంటుంది. మా టీమ్ అందరికీ ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. మీరు థియేటర్స్ కి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నమ్మకం ఉంది అన్నారు.
 
యాక్టర్ అజయ్ మాట్లాడుతూ, విక్రమార్కుడు తర్వాత మళ్లీ అలాంటి ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్ చేయగలుగుతానా లేదా అనిపించేది. థాంక్యూ సాహిత్ రైటింగ్ థిస్ రోల్. యూనిట్ అంతా తీవ్రమైన ఎండలో దాదాపు60 రోజులు ఒక విలేజ్ లో షూట్ చేశారు. సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సాహిత్ చాలా పెద్ద డైరెక్టర్ కాబోతున్నాడు. తనకి సినిమా మీద ఉన్న కన్వెన్షన్, తను తీసిన ఎమోషనల్ సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎడ్యుకేషన్ అనేది ఒక వెపన్. దానిమీద సినిమా తీసినప్పుడు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అవుతుందేమో అని ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ కి విజల్స్ కొడతారు. కమర్షియల్ ఎలిమెంట్స్ అంత ఎక్స్ ట్రార్డినరీ గా కుదిరాయి. ఈ సినిమాలో పనిచేసిన అందరూ చాలా సూపర్ గా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమాలో చిన్న పాప సరస్వతి క్యారెక్టర్ చేసింది. తను ఈ సినిమాకి సోల్.  సందీప్ గారు ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూసర్స్  సురేష్, నిశాంక్  గారు చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేశారు. సినిమాలో పనిచేసిన అందరికీ థాంక్యూ సో మచ్' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిమాలయాల్లో చిత్రీకరించిన మన్యం ధీరుడు చిత్రంలోని నమోస్తుతే.. పాటకు ఆదరణ