Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలపిట్ట హన్సికతో మళ్లీ శింబు ప్రేమాయణం.. ఎలా మొదలైందంటే?

Webdunia
సోమవారం, 27 మే 2019 (16:42 IST)
కోలీవుడ్ హీరో శింబు మళ్లీ ప్రేమలో పడ్డాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. నయనతార మాజీ ప్రేమికుడిగా పేరున్న శింబు.. ఆపై పాలపిట్ట హన్సిక ప్రేమలో పడ్డాడు. అయితే వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది. ఇటీవలే శింబు సోదరుడి వివాహం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో శింబు మళ్లీ హన్సిక ప్రేమలో వున్నాడని తెలిసింది. 
 
గతంలో మనస్పర్థల కారణంగా హన్సిక దూరం కావడం వల్ల కొంతకాలం డీలా పడిపోయిన శింబు.. తర్వాత కోలుకుని సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా శింబు - హన్సిక కలిసి నటించనున్నారనేది తాజా సమాచారం. 
 
హన్సిక 50వ చిత్రంగా, జమీల్ దర్శకత్వంలో 'మహా' రూపొందుతోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో శింబు కనిపించనున్నట్టు సమాచారం. శింబు పేరునే హన్సిక సూచించిందని కోలీవుడ్ వర్గాల్లో టాక్. ఆమె రిక్వెస్ట్ చేయడం వల్లనే శింబు ఓకే అన్నాడని దర్శకుడే స్వయంగా చెప్పాడు. 
 
ఈ సినిమాతో తాము మళ్లీ కలిసిపోయినట్టుగా హన్సిక కూడా స్పందించింది. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్లో కొన్ని రొమాంటిక్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. విడిపోయిన జంట మళ్లీ కలిసి తెరపై కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మళ్లీ ప్రేమపక్షులు ఒక్కటయ్యాయని సినీ పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

సజ్జల రామకృష్ణారెడ్డి భూదందా నిజమే.. నిగ్గు తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments