చలన చిత్రపరిశ్రమలో బయోపిక్‌ల రాజ్యం సాగుతున్న ఈ తరుణంలో హీరోలకీ, లీడర్‌లకే కాదు. విలన్‌గా నటిస్తూ తనదైన ప్రత్యేక ముద్రను వేసిన నా తండ్రికి కూడా బయోపిక్ ఉండాల్సిందేనని ముందుకొస్తోంది. సీనియర్ హీరోయిన్ రాధిక.
వివరాలలోకి వెళ్తే, తమిళ చలన చిత్ర పరిశ్రమలో ఎంజీఆర్... శివాజీ గణేశన్ వంటి స్టార్ హీరోలు రాజ్యం ఏలుతున్నప్పుడు, విలన్‌గా తనదైన ముద్ర వేసిన ఎంఆర్ రాధ అప్పటి తమిళ ప్రేక్షకులలో అందరికీ తెరపరిచితుడే. పేరుకి విలన్ పాత్రధారి అయినప్పటికీ, ఆయనకి తమిళనాట హీరోలతో సమానమైన క్రేజ్ ఉండేది. కాగా, ఒకానొక సమయంలో ఎంజీఆర్‌పై ఎంఆర్ రాధ కాల్పులు జరపడం సంచలనాత్మకంగా మారింది.
ఇలా ఎన్నో అనూహ్యమైన మలుపులతో కూడిన జీవితాన్ని గడిపిన ఎంఆర్ రాధకి సంబంధించిన... బయోపిక్‌ను తన సొంత బ్యానర్లో నిర్మించడానికి ఆయన కుమార్తె సీనియర్ హీరోయిన్ రాధిక రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ మేరకు ఎంఆర్ రాధ పాత్ర కోసం శింబును.. ఎంజీఆర్ పాత్ర కోసం అరవిందస్వామిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఎంఆర్ రాధ మనవడైన 'ఐకీ' ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తాడట. మరి విలన్ పోర్షన్‌లు చేసినా... ఏం చేసినా కూతురుకి నాన్నేగా.