జర్మన్ భామతో ప్రభాస్ ఫైట్

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (18:12 IST)
బాహుబలితో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్ కెరీర్‌లో తదుపరి సినిమాగా, అతని కెరీర్‌లోని 19వ సినిమాగా తెరకెక్కుతున్న సాహో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారతీయ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 15వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
 
సాహో సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు టీజర్‌లు విడుదలై అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంతగా ఆకట్టుకుంటూ, ఇంత మంది ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
 
కాగా... ఈ చిత్రానికి సంబంధించిన తాజా వార్త ఒకటి ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అది ఏమిటంటే... ఇందులో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ లీడ్ రోల్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే అయినప్పుటికీ.. ఇండో జర్మన్ తార ఎవైలన్ శర్మ దీనిలో కీలక పాత్ర పోషిస్తోందట.  ఆమె పాత్రకు సంబంధించిన కీలక సమాచారం ఇటీవల బయటకు వచ్చింది.
 
ఎవైలన్ శర్మ నెగెటివ్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఆవిడ గన్స్ పట్టుకొని ప్రభాస్‌కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తుందట. మరి ఇన్ని భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగష్టు 15 వరకు వేచి ఉండవలసిందే...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జోరు వర్షంలోనూ తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శన సమయం 15 గంటలు

ఏపీకి పొంచివున్న దిత్వా ముప్పు... పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్

టీవీ రేటింగ్స్ కోసం బార్క్ ఉద్యోగికి రూ.100 కోట్ల లంచం.. కేరళలో కొత్త స్కామ్

వైద్య కాలేజీలో ర్యాంగింగ్... యేడాది నలుగురు సీనియర్ విద్యార్థుల బహిష్కరణ

ఢిల్లీలో ఘోరం.. బూట్ల దుకాణంలో అగ్నిప్రమాదం.. నలుగురి సజీవదహనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments