Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమి- ఇంటర్నేషనల్ మూవీలా ఫీలవుతారు.: విశాల్

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (19:42 IST)
Vishal
‘నీ గురించి అన్నీ తెలిసిన నీ మిత్రుడే నీకు అతిపెద్ద శత్రువు’ అనే డైలాగ్ ఒక ఫైట్‌తో సమానం. ఇందులో ఫైట్స్ కంటే ఇంటలిజెన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్రెండ్స్‌గా ఉన్న ఇద్దరు శత్రువుల్లా ఎలా మారారు?.. తర్వాత వాళ్లు ఎప్పుడు కలుస్తారు అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది` అని విశాల్ అన్నారు. 
 
హీరో విశాల్, ఆర్య కాంబినేష‌న్‌లో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌ ‘ఎనిమి’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన ఈ మూవీ దీపావళి సందర్భంగా న‌వంబ‌ర్ 4న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా  హీరో విశాల్ చెప్పిన విశేషాలు.
 
- దర్శకుడు ఆనంద్ శంకర్ నాకు పరిచయమే లేదు. ఆయన ఒకసారి నాకు ఫోన్ చేసి కథ చెపుతానన్నారు. అప్పుడు ఆయన చేసిన నోటా, ఇరుముగళ్ సినిమాలు చూశాను. తర్వాత జస్ట్ కథ విన్నాను. నేను హీరోగా కథ వినలేదు. కేవలం ఒక ప్రేక్షకుడిగా కథ విన్నా. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.
-  సింగపూర్‌లో లిటిల్ ఇండియా అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ జరిగే కథ ఇది. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా అక్కడకు వెళ్లలేము. పోనీ మలేషియాలో చేద్దామనుకుంటే అక్కడ కూడా అదే పరిస్థితి. కరోనా ఫస్ట్ వేవ్‌లో 6 నెలల ఇంట్లోనే కూర్చున్నాం. ఆ తర్వాత ఇక దుబాయ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. కరోనా ప్యాండమిక్‌లో షూటింగ్ స్టార్ట్ చేసిన మొదటి సినిమా మాదే అనుకుంటా. దుబాయ్‌కు వెళ్లి అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేశాం. తర్వాత హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ మేము షూటింగ్ చేస్తున్నప్పుడు వేరే ఏ సినిమాల షూటింగ్స్ కూడా లేవు. ఏవో ఒకట్రెండు సీరియళ్ల షూటింగ్ మాత్రమే జరుగుతోంది. ఇక్కడ కూడా కరోనా నిబంధనలు పాటించి త్వరగా షూటింగ్ పూర్తి చేశాం
 
- ఈ సినిమా నిర్మాత వినోద్‌కు నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఏ నిర్మాత కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేరు. సినిమా కోసం 50 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఆయనకు ఓటీటీ నుంచి టేబుల్ ప్రాఫిట్ ఆఫర్ వచ్చింది. అయినా కూడా డబ్బుకు ఆశపడలేదు. ఈ విజువల్ ట్రీట్ సినిమాను థియేటర్లో చూస్తేనే బాగుంటుందని డిసైడ్ అయ్యారు. రెండు నెలలు వెయిట్ చేశారు. కరెక్ట్‌గా ఇప్పుడు దీపావళి కలిసొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాజిక్ నా కెరీర్‌లో కొన్ని సార్లే జరిగింది. నా కెరీర్‌లో ఇది బెస్ట్ సినిమా అవుతుంది. ప్రేక్షకులు ఇంటర్నేషనల్ మూవీలా ఫీలవుతారు.
 
- ఇందులో ఒక మెసేజ్ కూడా ఉంది. ఇది యాక్షన్ ప్యాక్డ్ మెసేజ్ ఓరియెంటెడ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఫర్‌ఫెక్ట్ దీపావళి గిఫ్ట్‌లా ఉంటుంది. అందురూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments