Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

దేవీ
గురువారం, 20 మార్చి 2025 (15:30 IST)
Trigun, Saptagiri
త్రిగుణ్, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "తాగితే తందానా". ఈ చిత్రాన్ని బీరం సుధాకర రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్ గుప్తా హీరోయిన్.రియా అనే అమ్మాయి ఇంకో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇటీవలే సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ పొందిన "తాగితే తందానా" సినిమా ఏప్రిల్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
మద్యం సేవించిన ఎవరైనా కామ్ గా పడుకోవాలని, తాగినప్పుడు బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుందని అతిగా ఆలోచిస్తే లేనిపోని ఇబ్బందుల్లో పడతారనే విషయాన్ని "తాగితే తందానా" సినిమాలో  ఫన్నీగా చూపించామని, అందుకే సినిమాకు డోంట్ డ్రింక్ అండ్ థింక్ అనే ట్యాగ్ లైన్ యాడ్ చేశామని మేకర్స్ చెబుతున్నారు.  క్రైమ్ కామెడీ జానర్ లో రూపొందిన  ఈ సినిమా టీజర్, ట్రైలర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే "తాగితే తందానా" సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు.
 
నటీనటులు - త్రిగుణ్, సప్తగిరి, సత్యం రాజేశ్, మధునందన్, విష్ణు ఓయ్, సిమ్రాన్ గుప్తా, రియా, తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments