Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ళ మా క‌ష్టాన్ని పైర‌సీ చేయ‌కండి - కెజిఎఫ్‌. రిక్వెస్ట్‌

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (18:42 IST)
KGF poster
కె.జి.ఎఫ్‌. సినిమా అనేది మా ఎనిమిదేళ్ళ క‌ష్టం. క‌న్నీళ్ళు, సంతోషాలు, గాయాలు, వంద‌లాది మంది శ్ర‌మ ఇదంతా వృధాగా పోనీయ‌కండి.. అంటూ చిత్ర యూనిట్ ప్రేక్ష‌కుల‌ను అభ్య‌ర్థిస్తోంది. రేపు అన‌గా శుక్ర‌వారంనాడు విడుద‌ల‌కానున్న ఈ సినిమా గురించి ఈ సాయంత్ర‌మే రిక్వెస్ట్ పోస్ట‌ర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ విడుద‌ల చేసింది.
 
య‌శ్ ఫొటోతో కూడిన ఈ పోస్ట‌ర్‌లో య‌శ్ శ్ర‌మ‌, కృషి, క‌న్నీళ్ళు, సంతోషాలు, బాధ‌లు అన్ని ఇమిడి వుండేలా సందేశం చూపించారు. పైరసీకి వ్యతిరేకంగా పోరాటం మీతో ప్రారంభమవుతుంది! దయచేసి వీడియోలు & ఫోటోలు తీయకండి మరియు వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయవద్దు! పైరసీకి నో చెప్పండి. అంటూ అందులో పేర్కొన్నారు.
 
ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా రెండు భాగాలు రూపొందింది. మొద‌టి భాగానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు కెజి.ఎఫ్‌.2 అనేది పాన్ ఇండియా మూవీగా విడుద‌ల కాబోతుంది. అన్ని భాష‌ల న‌టీన‌టులు ఇందులో న‌టించారు. హోంబ‌ళే ఫిలింస్ భారీగా నిర్మించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments