Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సింహాద్రి అప్పన్న స్వామి సేవలో కన్నడ రాకింగ్ స్టార్ యష్

Advertiesment
yash
, మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (09:13 IST)
కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం కేజీఎఫ్ - చాఫ్టర్ 2. ఈ చిత్రం ఈ నెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. మరోవైపు, చిత్ర హీరో యష్ ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల సందర్శనంలో ఉన్నారు. ఇందులోభాగంగా, సోమవారం శ్రీవారిని దర్శనం చేసుకున్న యష్.. ఆ తర్వాత సింహాద్రి అప్పన్న సేవలో పాల్గొన్నారు. 
 
ఎంతో ప్రసిద్ధి చెందిన సింహాద్రి అప్పన్న ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్ పోర్టులోనూ దర్శనమివ్వనున్నాడు. నగరానికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకోవడం కోసం ఎయిర్ పోర్టులోనే మందిరం ఏర్పాటు చేశారు. చందన రూపధారి అయిన సింహాద్రి అప్పన్నకు తొలిపూజను విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి శాస్త్రోక్తంగా నిర్వహించారు. 
 
విగ్రహం ఏర్పాటు చేసిన కాసేపటికే కేజీఎఫ్ హీరో యశ్ దర్శించుకున్నారు. అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అర్చకస్వామి సీతారామాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. సింహాచల క్షేత్ర ఈవో చంద్రకళ హీరో యశ్ కు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. 
 
దీనికి సంబంధించిన వివరాలను సింహాచల క్షేత్ర ఈవో చంద్రకళ తెలిపారు. ఇప్పటికే విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో సింహాద్రి అప్పన్న మందిరం ఏర్పాటు చేశామని, మరికొన్నిరోజుల్లో ఒడిశాలోని భువనేశ్వర్ రైల్వేస్టేషన్‌లో కూడా ఇదే తరహాలో స్వామివారి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏఆర్ రెహ్మాన్ సంచలన ట్వీట్.. అమిత్ షా "హిందీ''కి కౌంటరా? (video)