Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏఆర్ రెహ్మాన్ సంచలన ట్వీట్.. అమిత్ షా "హిందీ''కి కౌంటరా? (video)

Advertiesment
Rehman
, సోమవారం, 11 ఏప్రియల్ 2022 (21:01 IST)
ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంచలన ట్వీట్ చేశారు. వివాదాలకు దూరంగా ఉండే ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చకు దారితీసింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటిలో ఆయన పెట్టిన పోస్టు రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది. 
 
తమిళ దేవతగా భావించే తమిళళంగు అనే ఓ దేవత పెయింటింగ్‌ను ఆ ఫోటోలో పోస్ట్ చేశారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఎంఎస్‌ విశ్వనాథన్‌ సుందరం పిళ్లై రాసిన తమిళ జాతీయ గీతంలోని ఒక వాక్యాన్ని కూడా ఆ ఫొటోపై ఉంచారు ఏఆర్‌ రెహమాన్‌.
 
మన ఉనికికి మూలం ప్రియమైన తమిళం అంటూ 20వ శతాబ్దపు తమిళ కవి భారతిదాసన్‌ రాసిన 'తమిళియక్కమ్‌' కవితా సంకలనంలోని ఓ లైన్‌ను కూడా ఆ ఫొటోపై క్యాప్షన్‌గా ఉంచారు. ఇందులో ఎక్కడా కూడా వేరే భాషను కించపరిచే విధంగా లేదు.
 
అయితే రెహ్మాన్ పోస్టు మాత్రం కచ్చితంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటరేనని పలువురు చర్చించుకుంటున్నారు. స్థానిక భాషల తరువాత ఆంగ్లానికి ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని అమిత్ షా అన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా హిందీకి ప్రాముఖ్యత ఇస్తుందని ప్రకటించారు. 
webdunia
AR Rahman
 
హిందీ నిఘంటువును సవరించాల్సిన అవసరం ఉందని, విద్యార్థులకు తొమ్మిదో తరగతి వరకు హిందీలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలని, హిందీ బోధన, పరీక్షలపైనా మరింత దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు నుంచి కాక దాదాపు అన్ని ప్రాంతాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
 
అంతేగాకుండా స్థానిక భాషలకు కాకుండా ఇంగ్లీష్‌కు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని ఏప్రిల్ 7న అమిత్ షా చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డేట్ ఫిక్స్ చేసిన నిఖిల్ కార్తికేయ 2