Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డేట్ ఫిక్స్ చేసిన నిఖిల్ కార్తికేయ 2

Advertiesment
Nikhil
, సోమవారం, 11 ఏప్రియల్ 2022 (17:52 IST)
Nikhil
ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్.. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2 షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. కార్తికేయ 2ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా జులై 22 న విడుద‌ల చేస్తున్నారు. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
కార్తికేయ‌ 2 షూటింగ్ మొద‌ల‌య్యిన ద‌గ్గ‌ర‌ నుంచి సామాన్య ప్రేక్ష‌కుల్లో, సినిమా ప్ర‌ముఖుల్లో ఆసక్తి నెల‌కొంది. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది. .  ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.  
 
Saviours Emerge in crisis అంటూ ఆ మధ్య విడుదలైన నిఖిల్ బర్త్ డే పోస్టర్‌లో ఉన్న మ్యాటర్ ఆకట్టుకుంది. అదే విధంగా  తాజాగా విడుదల చేసిన పోస్ట‌ర్ లో ఇంట్ర‌స్టింగ్ థింగ్ ఏంటంటే డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం.  శ్రీకృష్టుడి చ‌రిత్రకి సంబంధించిన ద్వారక, ద్వాప‌ర యుగంలో జ‌రిగింది. ఇప్ప‌టికి ఆ లింక్ లో కార్తికేయ‌ శ్రీ కృష్ణుడి గురించి వెతికే ఒక ప్ర‌యాణం.
 
శ్రీ కృష్ణుడు ఆయ‌న‌కి సంబందించిన క‌థలో డాక్ట‌ర్ కార్తికేయ అన్వేష‌ణగా శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నాడు.  ఈ చిత్రంలోని భావాన్ని ఈ పోస్ట‌ర్ ద్వారా ద‌ర్శ‌కుడు చందు మొండేటి ప్రేక్ష‌కుల క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని జులై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
 
నటీనటులు:
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైజాగ్ పోర్ట్‌లో అఖిల్‌కు బైక్ భారీ ర్యాలీతో స్వాగ‌తం