Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్వ‌తీశం, జ‌ష్విక న‌టించిన తెలుసా మనసా టీంను అభినందించిన డైరెక్టర్ బాబీ

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (14:57 IST)
Parvatheesham, Jasvika
‘కేరింత’ ఫేమ్ పార్వ‌తీశం, జ‌ష్విక జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘తెలుసా మనసా’. న్యూ ఏజ్ ప్లాటోనిక్ ల‌వ్‌స్టోరిగా ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వ‌ర్షా ముండాడ, మాధ‌వి నిర్మించారు. వైభ‌వ్ ద‌ర్శ‌కుడు. పార్వ‌తీశం ప‌ల్లెటూర్లో బెలూన్స్ అమ్ముకునే కుర్రాడు మ‌ల్లి బాబు పాత్ర‌లో న‌టించారు. హెల్త్ అసిస్టెంట్ సుజాత పాత్ర‌లో జ‌ష్విక న‌టించింది. వారిద్ద‌రికీ ఒక‌రంటే ఒక‌రికి చెప్ప‌లేనంత ప్రేమ ఉంటుంది. కానీ దాన్ని బ‌య‌ట‌కు చెప్పుకోలేరు. మ‌రీ ముఖ్యంగా మ‌ల్లిబాబు అయితే ప‌లు సంద‌ర్భాల్లో సుజాత‌కు త‌న ప్రేమ‌ను చెప్ప‌టానికి ప్ర‌య‌త్నించి చెప్ప‌లేక‌పోతాడు. అయితే ఇద్ద‌రూ అనుకోని కార‌ణాల‌తో దూర‌మ‌వుతారు. మ‌రి వాళ్లిద్ద‌రూ క‌లుసుకున్నారా? అనేది ‘తెలుసా మనసా’  సినిమా క‌థాంశం. 
 
మంగ‌ళ‌వారం ఈ సినిమా నుంచి ‘మనసు మనసుతో..’ అనే మెలోడి సాంగ్ విడుద‌లైంది. వాల్తేరు వీర‌య్య‌తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు బాబీ కొల్లి ఈ పాట‌ను విడుద‌ల చేసి.. సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు.  
 
నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మ‌రోసారి ఈ పాట‌లో ఆయ‌న త‌న‌దైన మార్క్ చూపించారు. వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా.. నిజ‌మైన ప్రేమ‌లోని లోతును ఆవిష్క‌రించేలా, హృద‌యానికి హ‌త్తుకునేలా మ‌న‌సు మ‌న‌సుతో పాట  ఉంది. వ‌న‌మాలి రాసిన ఈ పాట‌ను శ్రీకృష్ణ అద్భుతంగా ఆల‌పించారు. ప్ర‌సాద్ ఈద‌ర సినిమాటోగ్ర‌ఫీ ఈ పాట‌కు మ‌రింత అందాన్నిచ్చింది. 
 
డెబ్యూ డైరెక్ట‌ర్ వైభ‌వ్ .. ‘తెలుసా మనసా..’ చిత్రాన్ని న్యూ ఏజ్ ల‌వ్‌స్టోరిగా అద్భుతంగా మ‌లుస్తున్నార‌ని త్వ‌ర‌లోనే మ‌రిన్ని విష‌యాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు. 
 
న‌టీన‌టులు:
 
పార్వ‌తీశం, జ‌శ్విక‌, రోహిణి హ‌ట్టంగ‌డి, మ‌హేష్ అచంట‌, అలీ రెజా, లావ‌ణ్య‌, మాస్ట‌ర్ అద్వితేజ్‌, వెంకీ, శివ‌, శోభ‌న్ త‌దిత‌రులు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వయంగా కారు నడుపుతూ కనిపించిన కేసీఆర్.. బీఆర్ఎస్ వర్గాల్లో ఖుషీ (video)

తెలంగాణలో చలి: కొమరం భీమ్ జిల్లాలో వణికిపోతున్న జనం

భువనేశ్వర్‌: నాలుగేళ్ల బాలికను.. రూ.40వేలకు అమ్మేశారు.. ఎందుకంటే?

రఘురామకృష్ణంరాజు కేసు.. రిటైర్డ్ సీఐడీ ఏఎస్పీ అరెస్ట్.. ఇవన్నీ జరిగాయా?

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments