Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరంజీవి గారు మా నాన్న గారి లా లేరు: రామ్ చరణ్

Ram charan
, సోమవారం, 30 జనవరి 2023 (07:41 IST)
Ram charan
చిరంజీవి,  రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) మెగా మాస్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన ‘వాల్తేరు వీరయ్య’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ‘వీరయ్య విజయ విహారం’’ సక్సెస్ సెలబ్రేషన్స్ ని వరంగల్ హన్మకొండలో గ్రాండ్ గా నిర్వహించారు. 
 
రామ్ చరణ్ మాట్లాడుతూ, నాకే కాదు వారితో పని చేసిన ప్రతి హీరోకి బ్లాక్ బస్టర్ ఇచ్చే నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. సినిమా అంటే అంకితభావం వున్న నిర్మాతలు. నిజంగా దమ్మున్న నిర్మాతలు. బాబీ గారికి బిగ్ కంగ్రాట్స్. వాల్తేరు వీరయ్య చూశాను  ప్రతి ఫ్రేం ని అద్భుతంగా మలిచారు బాబీ.. చిరంజీవి గారు మా నాన్న గారి లా లేరు.. మా బ్రదర్ లా వున్నారు. నేను ఇక్కడికి ఒక అభిమానిగా వచ్చాను. ఈ సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేశానో మీతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. రవితేజ గారి తో ఒక డీప్ సీరియస్ క్యారెక్టర్ చేయించి దానిని కూడా మేము ఎంజాయ్ చేసేలా చేశాడు బాబీ. నిజంగా పూనకాలు లోడింగ్. నాతో పాటు అభిమానులందరికీ వాల్తేరు వీరయ్య గుర్తుండిపోయే చిత్రం. దేవిశ్రీ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా అభినందనలు. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు. 
 
అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, వాల్తేరు వీరయ్య 250 కోట్ల గ్రాస్ కి చేరబోతుందంటే అది ఆషామాషీ విషయం కాదు. ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలని అనుకున్నారో అలా మళ్ళీ తెరపై చూస్తూ ఒక ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ ఇలాంటి సినిమాలని గుర్తు చేసుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి ఫీలింగ్ మీకు నాకు కలిగించడానికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ. నాపై అభిమానంతో బాబీ ఇండస్ట్రీకి రావడం, ఎప్పటికైనా నాతొ సినిమా చేయాలనీ కోరుకోవడం... అది మామూలు సినిమా కాలేదు. ఖైదీ సినిమా నాకు ఎలాంటి స్టార్ డమ్ తీసుకొచ్చిందో .. దర్శకుడిగా బాబీని వాల్తేరు వీరయ్య  ఒక స్టార్ డైరెక్టర్ ని చేసింది. బాబీ ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం బాబీ పని చేసిన తీరుకు నేను అభిమాని అయిపోయాను.  మైత్రీ మూవీ  మేకర్స్  లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలని చరణ్ చెప్పేవాడు. నేను మళ్ళీ సినిమాలు చేస్తే మాతో సినిమా చేసే అవాశం ఇవ్వండని మైత్రీ నిర్మాతలు కోరారు. అప్పుడే మాట ఇచ్చాను. ఇప్పుడు వాల్తేరు వీరయ్యతో ఓ అద్భుతమైన విజయంతో ఇది జరిగింది.   దేవిశ్రీ ప్రసాద్ మాస్, మెలోడీ, ఊరమాస్ నెంబర్స్ ఇచ్చాడు. రామ్ లక్ష్మణ్ పీటర్ హెయిన్స్ శేఖర్ మాస్టర్ అందరూ అద్భుతంగా చేశారు. శ్రుతి హాసన్ అద్భుతంగా చేసింది అని  తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రవితేజ రావణాసుర స్పెషల్ సాంగ్ స్టిల్ విడుదల