Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

డీవీ
మంగళవారం, 24 డిశెంబరు 2024 (16:47 IST)
Dil ruba comp;ed poster
కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. "దిల్ రూబా" సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
తాజాగా "దిల్ రూబా" సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అరుదైన బ్యూటిఫుల్ లొకేషన్స్ లో సినిమాను హై క్వాలిటీతో రూపొందించారు. త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు. ఇటీవల అనౌన్స్ చేసిన "దిల్ రూబా" సినిమా టైటిల్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా "దిల్ రూబా" సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. "క" సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న చిత్రంగా "దిల్ రూబా" పై ఇటు ప్రేక్షకులు, అటు ట్రేడ్ సర్కిల్స్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Suitcase: భార్యను కత్తితో పొడిచి.. మృతదేహాన్ని మడతపెట్టి ట్రాలీ బ్యాగులో కుక్కిన టెక్కీ.. ఆపై జంప్!

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments