Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వ‌క్‌సేన్ హీరోగా "దిల్" రాజు కొత్త చిత్రం ప్రారంభం

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (13:33 IST)
టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీవీపీ సినిమా, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ పతాకాల‌పై యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ క‌థానాయ‌కుడిగా కొత్త చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. త‌మిళంలో సూప‌ర్‌హిట్ అయిన "ఓ మై క‌డ‌వులే" సినిమాకు ఇది రీమేక్‌. త‌మిళంలో ‘ఓ మై క‌డ‌వులే’ సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అశ్వ‌త్ మారిముత్తు తెలుగులోనూ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. 
 
ముహూర్త‌పు స‌న్నివేశానికి హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు క్లాప్ కొట్ట‌గా, ప్ర‌ముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ముహ‌ర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ద‌ర్శ‌కుడు అశ్వ‌త్ మారిముత్తుకి దిల్‌రాజు స్క్రిప్ట్‌ను అందించారు. ఫిబ్ర‌వ‌రి మూడో వారం నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 
 
బెస్ట్ డైలాగ్ రైట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్‌ను అందుకున్న డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ఈ చిత్రానికి మాట‌ల‌ను అందించారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. త్వరలోనే హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Birthday: బర్త్ డే జరుపుకుందామనుకుంటే.. కేకు పేలింది.. (video)

అధ్యక్షా... ఈ పోల్ ఇపుడు అవసరమా? పరువు పోగొట్టుకున్న టి.కాంగ్రెస్, రేవంత్ ఫైర్

Hall Tickets: హాల్ టిక్కెట్లు లేకపోయినా పరీక్షలు రాయడానికి అనుమతి.. ఎక్కడంటే?

అది మా పనోళ్ల కోసం నిర్మించిన సెక్యూర్డ్ భవనం : మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Video)

ప్రయాగ్ రాజ్ మోనాలిసా ఇంటికి దర్శకుడు సనోజ్ మిశ్రా, సినీ ఆఫర్ కన్ఫర్మ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments