క్వారంటైన్‌లో 'మగతోడు' లేకుండా ఉండలేకపోయా.. అందుకే (Video)

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (13:14 IST)
బాలీవుడ్ సీనియర్ నటీమణుల్లో మలైకా అరోరా ఒకరు. ఈమె వయసు ప్రస్తుతం 47. ఓ బిడ్డకు తల్లికూడా. అయినప్పటికీ అందాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో తనకంటే 12 యేళ్లు తక్కువ వయసున్న బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్‌తో సహజీవనం చేస్తోంది. కాస్త వీలు చిక్కితే చాలు ప్రియుడుని వెంటేసుకుని విదేశాలకు చెక్కేసి ఎంజాయ్ చేసి వస్తోంది. అయితే, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. కానీ హాట్ బ్యూటీ మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. అటు అర్జున్ కపూర్ కూడా పెదవి విప్పడం లేదు. 
 
ఈ క్రమంలో వీరిద్దరూ గత సెప్టెంబరు నెలలో కరోనా వైరస్ బారినపడ్డారు. ఆ తర్వాత హోం క్వారంటైన్‌లో కలిసేవున్నారు. వైద్యుల పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకోవడంతో తక్కువ సమయంలోనే కోలుకున్నారు.
 
ఈ క్రమంలో మలైకా అరోరా తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చింది. 'మీకు ఒకవేళ అవకాశం వస్తే ఏ నటుడితో కలిసి క్వారంటైన్‌లో ఉండాలనుకుంటున్నారు?' అనే ప్రశ్న మలైకాకు ఎదురైంది. 
 
దీనికి స్పందించిన మలైక.. 'నిజం చెప్పాలంటే.. నేను రియల్‌గా ఓ నటుడితోనే క్వారంటైన్‌లో ఉన్నాను. అతను మంచివాడు. చాలా సరదా మనిషి. అతనితో ఉంటే ప్రతి క్షణం చాలా ఉత్సాహంగా ఉంటుంద'ని అర్జున్ పేరు వెల్లడించకుండానే బదులిచ్చింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Woman: దిండుక్కల్‌‍లో ఘోరం.. బస్సు నుంచి కిందపడిన మహిళ మృతి (video)

Telugu Love: అబ్బా.. ఎంత బాగా తెలుగు మాట్లాడారు.. కృతికా శుక్లాపై పవన్ ప్రశంసలు

ఏలూరు: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

Somireddy: జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. సోమిరెడ్డి డిమాండ్

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments