"ఆర్ఆర్ఆర్" కోసం "రిలీజ్ డేట్‌"ను త్యాగం చేస్తానంటున్న నిర్మాత!

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (12:18 IST)
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మితమైన "ఆర్ఆర్ఆర్" చిత్రం. జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురావాల్సివంది. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి, కరోనా ఆంక్షలు, రాత్రిపూట కర్ఫ్యూ, థియేటర్లలో 50 శాతం సీటింగ్ కెపాసిటీ వంటి కారణాలతో ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో విడుదల చేయనున్నట్టు తాజాగా ఆ చిత్రం నిర్మాత డీవీవీ దానయ్య వెల్లడించారు. 
 
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అజయ్ దేవగణ్ వంటి భారీ తారాగణం నటించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌ స్థాయి పెరగాలని, ఇందుకోసం పాన్ ఇండియా సినిమాలు విడుదల కావాలని కోరారు. ఈ విషయంలో తన చిత్రాల విడుదల తేదీలను త్యాగం చేస్తానని ప్రకటించారు. ఇందులోభాగంగా తన చిత్రం "ఎఫ్-3"ని విడుదలను వాయిదా వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
"ఆర్ఆర్ఆర్" చిత్రానికి మార్చి 18, ఏప్రిల్ 28వ తేదీ అనే రెండు తేదీలను ప్రకటించారు. మా ఎఫ్-3 28వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఒకవేళ "ఆర్ఆర్ఆర్" చిత్రం ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ చేస్తే మాత్రం తమ చిత్రాన్ని వాయిదా వేస్తామని తెలిపారు. ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే. అందరూ కూర్చొని విడుదల తేదీలపై చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments