Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

థియేట‌ర్ల‌లో క‌లెక్ష‌న్లు ప‌డిపోయాయి

Advertiesment
థియేట‌ర్ల‌లో క‌లెక్ష‌న్లు ప‌డిపోయాయి
, శనివారం, 22 జనవరి 2022 (17:48 IST)
Cinema hall ph
తెలంగాణ‌, ఆంధ్ర అనే తేడా లేకుండా థియేట‌ర్ల‌కు జ‌నాలు పెద్ద‌గా రావ‌డంలేదు. ఆంధ్ర‌లో యాభై శాతం వున్న సీటింగ్ కెపాసిటీ కొన్నిచోట్ల అదికూడా నిండ‌డంలేదు. అఖండ‌, బంగార్రాజు వంటి సినిమాలు మిన‌హా ఏ సినిమాకూ పెద్ద‌గా క‌లెక్ష‌న్లు లేవు. ఇటీవ‌లే విశాఖ నుంచి విజ‌య‌వాడ వ‌ర‌కు నిర్మాత దిల్ రాజు త‌న సోద‌రిని కుమారుడు రౌడీ బాయ్స్ సినిమా ప్ర‌మోష‌న్ కోసం టూర్ నిర్వ‌హించారు. చాలా చోట్ల చిత్ర టీమ్ వ‌స్తుంద‌ని ప్ర‌చారం చేయ‌డంతో కొద్దో గొప్ప జ‌నాలు వ‌చ్చారు మిన‌హా టోట‌ల్‌గా చూస్తే ఆశించినంత లేద‌ని ఆయ‌న ఇటీవ‌లే వెల్ల‌డించారు.
 
కోవిడ్ టైంలో థియేట‌ర్ ఓపెన్ చేసేలా వై.ఎస్‌. జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నా ఎందుక‌నే జ‌నాలు రావ‌డంలేదు. చాలా చోట్ల ఓమిక్రాన్ తీవత్ర బాగా కనిపిస్తోంది. దానితో అంద‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. కానీ, షాపింగ్ మాల్స్ కు మాత్రం బాగానే జ‌నాలు రావ‌డం విశేషం. థియేట‌ర్‌కు వ‌చ్చి టైం వేస్ట్ చేయ‌డం కంటే ఓటీటీ అవ‌కాశం వుండ‌డంతో ఇంటిలోనే కుటుంబ‌మంతా సినిమా చూసేస్తున్నారు. మా బేన‌ర్, మా హీరో తొలి సినిమా రౌడీ బాయ్స్ డేర్ చేసి విడుద‌ల చేశాం. కానీ మేం అనుకున్నంత క‌లెక్ష‌న్లు లేవు.  చాలా చోట్ల తెలంగాణ‌లో బంగార్రాజుకూడా లేవ‌ని క‌లెక్ష‌న్లు తెలుపుతున్నాయి. ఆంధ్ర‌లో బాగానే సంక్రాంతికి సినిమా చూసేశారు. దానితో దాదాపు 32.50 కోట్ల గ్రామ్ వ‌చ్చింది. ఇంకా 4 కోట్లు వ‌స్తే బ్రేక్ ఈవెన్ అవుతారు. అది కూడా త్వ‌ర‌లో చేరుతుంద‌ని ఎగ్జిబిట‌ర్లు తెలియ‌జేస్తున్నారు.
 
ఇక సంక్రాంతి త‌ర్వాత ఇంకా థియేర్ల‌లో సినిమాలు విడుద‌ల ఒక‌టి అరా మిన‌హా ఎవ్వ‌రూ విడుద‌ల చేయ‌డంలేదు. దాదాపు ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు మీడియం సినిమాలు కూడా విడుద‌ల‌కు నోచుకోవ‌ని తెలుస్తోంది. 21న న‌ట్టికుమార్ రూపొందిన `సైకో వ‌ర్మ‌`. పరిమితంగా విడుద‌లైతే ప‌ద్మ‌శ్రీ అనే హార్ర‌ర్ మూవీ ఈరోజు విడుద‌లైంది.  అదేవిధంగా ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా ఏప్రిల్‌లో విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అప్ప‌టివ‌ర‌కు పెద్ద‌గా సినిమాలు వుండ‌వ‌ని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుధీర్ బాబు, కృతి శెట్టి మ‌ధ్య కెమిస్ట్రీ హైలెట్ అయింది