Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుధీర్ బాబు, కృతి శెట్టి మ‌ధ్య కెమిస్ట్రీ హైలెట్ అయింది

సుధీర్ బాబు, కృతి శెట్టి మ‌ధ్య కెమిస్ట్రీ హైలెట్ అయింది
, శనివారం, 22 జనవరి 2022 (17:01 IST)
Sudhir Babu, Kriti Shetty,
హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కమర్షియల్ ఫిల్మ్ మేకర్‌గా కనిపించబోతోన్నారు. టీజర్‌లో సుధీర్ బాబు వరుసగా ఆరేళ్లు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన దర్శకుడిగా పరిచయం అవుతారు. తన గెలుపుపై సుధీర్ బాబు ఎంతో గర్వంగా ఫీలవుతుంటారు. కానీ పక్కనే ఉన్న స్నేహితులు మాత్రం రొటిన్ సినిమాలు తీస్తున్నావేంటని అంటుంటారు. డాక్టర్ అలేఖ్య పాత్రలో కృతి శెట్టి కనిపించింది. ఈమెకు సినిమాలంటే నచ్చవు. ఈ ఇద్దరివి భిన్న రుచులు, మనస్తత్వాలు, ఆలోచనలే అయినా ప్రేమ చిగురిస్తుంది. ఆమెతోనే హీరోయిన్ సెంట్రిక్ మూవీని తీసేందుకు ప్రయత్నిస్తాడు. టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి. ఇందులో సుధీర్ బాబు, కృతి శెట్టి కెమిస్ట్రీ హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. పీజీ విందా కెమెరా పనితనం, వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. మొత్తానికి టీజర్‌తో సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది.
 
సాహి సురేష్ ఆర్ట్ డిపార్ట్మెంట్, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్‌ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
 
అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
 
నటీనటులు: సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
 
సాంకేతిక బృందం
 
రచన, దర్శకత్వం :  మోహనకృష్ణ ఇంద్రగంటి
నిర్మాతలు :  బీ మహేందర్ బాబు, కిరణ్ బల్లపల్లి
సమర్పణ :  గాజులపల్లి సుధీర్ బాబు
బ్యానర్  : బెంచ్ మార్క్ స్టూడియోస్
సంగీతం  : వివేక్ సాగర్
కెమెరామెన్ :  పీజీ విందా
ఆర్ట్  : సాహి సురేష్
ఎడిటర్ :  మార్తాండ్ కే వెంకటేష్
లిరిక్స్ :  సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యాం
కో డైరెక్టర్ :  కోట సురేష్ కుమార్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాకి గాళ్ ను మార్కెట్లోకి ప్ర‌వేశ‌పెట్టిన‌ స‌మంత ప్ర‌భు