తెలంగాణ సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతీష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఉప ఎన్నికలకు ముందు మొట్టమొదటగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేశారు.
తర్వాత క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్న హామీ మేరకు తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు అమలు చేయనున్నారు. కాగా హుజూరాబాద్‌లో దళితబంధును ప్రకటించిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా తెలంగాణలో వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లోనూ దళితబంధును అమలు చేయనుంది. దళితబంధు అమలును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
దళితబంధు అమలుపై జిల్లా కలెక్టర్లతో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లలను ఆదేశించారు.