Webdunia - Bharat's app for daily news and videos

Install App

హారర్ బ్యాక్ డ్రాప్ లో ఆశిష్ మూడో చిత్రానికి దిల్ రాజు ఆశీస్సులు

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (15:53 IST)
Dill raju family blesses aasish
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసి తనదైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో ఆశిష్. ఇప్పుడు సెల్ఫీష్ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఆశిష్  మూడో చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మూవీ రొమాంటిక్ హారర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుంది.

ఈ ఏడాది దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శిరీష్ సమర్పణలో 'బలగం' వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీని అందించిన యంగ్ ప్రొడ్యూసర్స్ హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డిలతో పాటు నాగార్జున మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 
 
ఈ సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో చినబాబు, నాగవంశీ తదితరులు హాజరయ్యారు. రొమాంటిక్ హారర్ లవ్ స్టోరీ కోసం సినీ ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్ అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

తర్వాతి కథనం
Show comments