Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలోనే గర్వించదగ్గ చిత్రపురికాలనీ ఏర్పాటు : సినీ ప్రముఖులు ఉద్ఘాటన

Shyamprasad Reddy, C. Kalyan, Damodaraprasad, anil vallbhaneni
, బుధవారం, 16 ఆగస్టు 2023 (18:20 IST)
Shyamprasad Reddy, C. Kalyan, Damodaraprasad, anil vallbhaneni
హైదరాబాద్‌లోని మణికొండ జాగీర్‌లోని వున్న చిత్రపురికాలనీలో ప్రధాన ద్వారం దగ్గర కాలనీకి అంకురార్పణకు దోహదపడిన అప్పటి ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. బుధవారంనాడు జరిగిన ఈ కార్యక్రమానికి సీనిప్రముఖులు దిల్‌రాజు, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, సి.కళ్యాణ్‌, దామోదరప్రసాద్‌, ప్రసన్నకుమార్‌, వల్లభనేని అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా శబ్దాలయ అదినేత, ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, అప్పట్లో సినిమాలు తీయాలంటే కార్మికులు చెన్నైలోనివారు చేసేవారు. 1993లో అమ్మోరు సినిమా కోడిరామకృష్ణ గారితో తీస్తుండగా చెన్నై కార్మికులతో చిన్న సమస్య ఎదురైంది. హైదరాబాద్‌ కార్మిలకులతో పనిచేయాలని చూశాం. నా సినిమాతోపాటు అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలో షూటింగ్‌ ఆగిపోయాయి. అప్పట్లో కోట్ల విజయభాస్కరరెడ్డి సి.ఎం.గా వున్నారు. ఆ టైంలో ప్రభాకర్‌రెడ్డిగారి చొరవతో కోట్ల విజయభాస్కరరెడ్డిగారితో హైదరాబాద్‌లో ఫిలిం ఇండస్ట్రీ సెటిల్‌ కావాలంటే నిర్మాతలేకాదు. వారితోపాటు కార్మికులు సెటిల్‌ కావాలని అందుకు వారికి తగిన వసతి సదుపాయం కల్పించాలని అన్నారు. అప్పుడు ప్రభుత్వపరంగా తాను పూర్తిగా సహకరింస్తానని కోట్ల విజయభాస్కరరెడ్డి హామీ ఇవ్వడంతో ప్రభాకర్‌ రెడ్డిగారు ప్రభుత్వపరంగా స్థలాలు సేకరించి అప్పుడు కొండలు, గుట్టలు వున్న 67 ఎకరాలను అప్రూవల్‌ చేయించారు. కేవలం కార్మికులకు మాత్రమే ఇచ్చారు. 94లో దానికి అంకురార్పణ జరిగింది. ఈరోజు 4వేలకు పైగా కుటుంబాలు హాయిగా వుంటున్నారు. ఇందుకు కమిటీ కూడా పూర్తి తోడ్పాటుచేస్తుందని అన్నారు.
 
చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ, గతంలో పెద్దలంతా కలిసి సాధించిన ఈ చిత్రపురికాలనీ దేశంలోనే గర్వించదగ్గ కాలనీగా పేరుపొందింది. అప్పట్లో నేను ఎంప్లాయిగా ఉన్నాను. అన్ని సమస్యలు తెలుసు. కార్మికుల కోరికమేరకు ఇప్పుడు అధ్యక్షుడిగా వుండి పలు అసంపూర్తిగా వున్న పనులు పూర్తిచేయలిగాను. ఇంకా చాలా సమస్యలున్నాయి. కొందరు కోర్టువరకు వెళ్ళి అభివృద్ధి నిరోధానికి తోడ్పడుతున్నారు. త్వరలో అన్ని సమస్యలు తీరిపోతాయి. ఇంతకుముందున్న సొసైటీ స్థలంలో త్వరలో ట్విన్‌ టవర్స్‌ కూడా కట్టి ఇంకా ఇల్లు అందని కార్మికులకు పూర్తి న్యాయం చేయాలనుకుంటున్నానని ఇందుకు అందరూ సహకరించాలని కోరారు.
 
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, హైదరాబాద్‌లో సినీకార్మికులందరినీ కలిపివుండేలా  చేసిన ఘనత కోట్ల విజయభాస్కరెడ్డిగారికి, ప్రభాకర్‌రెడ్డిగారి వంటి ప్రముఖులకు దక్కింది. దేశంలో ఇలా కార్మికులంతా ఒకేచోట వుండేలా చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, చిత్రపురి కాలనీ మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని అన్నారు.
 
సీనియర్‌ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, తొలుత చిత్రపురికాలనీ ఏర్పడిన విధానం, కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారులు ఎలా సహకరించారో వివరిస్తూ, అప్పట్లో కొంతస్తలాన్నికూడా కొనుగోలుచేసి కార్మికులందరికీ న్యాయం జరగాలని చూశామని అన్నారు.
 
ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌ మాట్లాడుతూ, చిత్రపురి కార్మికుల కాలనీ ఏర్పడినందుకు చాలా ఆనందంగా వుందనీ, ఇందుకు అంకురార్పణ జరిగిన ప్రముఖుల్లో దాసరిగారు కూడా వున్నారని వారందరి కృషివల్లే ఇది సాధ్యపడిరదని పేర్కొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్‌, దామోదరప్రసాద్‌ తదితరులు మాట్లాడుతూ,  చిత్రపురి కాలనీ దేశంలోనే గర్వించదగిన కాలనీగా ఉందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్టర్ ప్రెగ్నెంట్ చూశాక ఇదొక మంచి సినిమా అంటారు : దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి