Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సైనికుల‌కు నివాళే సోల్ ఆఫ్ సత్య: సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్

Advertiesment
Naveen, charan saitej
, బుధవారం, 16 ఆగస్టు 2023 (08:45 IST)
Naveen, charan saitej
సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, క‌ల‌ర్స్ స్వాతి జంట‌గా న‌వీన్ విజ‌యకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన షార్ట్ ఫీచర్ ‘స‌త్య‌’.  దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్, హ‌న్షిత దీన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 15న స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ షార్ట్ ఫీచర్ నుంచి సోల్ ఆఫ్ స‌త్య అనే మ్యూజిక‌ల్ షార్ట్‌ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు.  
 
ఈసంద‌ర్భంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘‘సత్య.. మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన షార్ట్ ఫీచ‌ర్‌. ఇది అంద‌రికీ రీచ్ కావాలి. స‌త్య లేకుండా సూర్య లేడు. సూర్య లేకుండా స‌త్య లేదు. అంద‌రం టీమ్‌గా వ‌ర్క్ చేశాం. న‌వీన్ ఎంత టాలెంట్ ప‌ర్స‌నో నాకు తెలుసు. అది ప్ర‌పంచానికి తెలియాల‌ని నేను ఇందులో భాగ‌మ‌య్యాను. దేశం కోసం ఓ సైనికుడు ఎంత త్యాగం చేస్తారో మ‌న‌కు తెలుసు. సోల్జ‌ర్స్‌.. మ‌న రేప‌టి కోసం వాళ్లు నేటి రోజుని త్యాగం చేస్తున్నారు. వాళ్లంద‌రికీ సెల్యూట్‌. అలాంటి సైనికుల‌ను స‌రిహ‌ద్దుల‌కు పంపుతున్న త‌ల్లులు, భార్య‌లు, చెల్లెళ్లు, అక్క‌లు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. వారంద‌రికీ నివాళులు అర్పిస్తూ సోల్ ఆఫ్ స‌త్య‌ సాంగ్‌ను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మా సాంగ్‌ను లాంచ్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌గారికి థాంక్స్‌. హిందీ వెర్ష‌న్‌కు రాశీ ఖ‌న్నా డ‌బ్బింగ్ చెప్పింది. ఈ సంద‌ర్భంగా వారికి ధ‌న్య‌వాదాలు. సాంగ్‌ను రిలీజ్ చేయ‌టానికి ముందుకు వ‌చ్చిన టి సిరీస్ భూష‌ణ్‌గారికి థాంక్స్‌’’ అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ శ్రుతి రంజని మాట్లాడుతూ ‘‘సంతోషంలో మాటలు రావటం లేదు. కొత్త మ్యూజిక్ డైరెక్ట‌ర్ కావాల‌నుకుంటున్నార‌ని తెలిసి నేను డెమో పంపితే ఈ సాంగ్ షార్ట్ లిస్ట్ అయ్యింది. న‌వీన్‌గారు ఓ సైనికుడి క‌థ‌ను దీనికి స్క్రిప్ట్‌గా అందంగా మ‌లిచారు. తేజ్‌, స్వాతి స‌హా ఎంటైర్ టీమ్‌కి థాంక్స్‌’’ అన్నారు. 
 
దర్శకుడు నవీన్ విజయ‌కృష్ణ మాట్లాడుతూ ‘‘జీవితంలో ముందుకు రావటం ఎంతో ముఖ్యం. మా నాన్న‌మ్మ విజ‌య నిర్మ‌ల‌గారు, మా అమ్మ‌గారు నేత్ర‌.. న‌న్ను జీవితంలో గొప్ప స్థాయిలో చూడాల‌ని అనుకున్నారు. కానీ నేను ఆ ప‌ని చేయ‌లేక‌పోయాన‌నే బాధ‌లో కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవాల్సి వ‌చ్చింది. ఇప్పుడు నేను స‌త్య చేశానంటే వాళ్లే కార‌ణం. స‌త్య కాన్సెప్ట్ రాసిన‌ప్పుడు, తీసిన‌ప్పుడు ఎమోష‌న్ మాత్ర‌మే గుర్తుకు ఉంది. ఎవ‌రైనా మ‌నం మిస్ చేసుకున్న‌ప్పుడు ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని శ్రుతి రంజ‌నిగారు అంద‌మైన ట్యూన్‌గా మ‌లిచారు. దానికి క‌నెక్ట్ అయ్యాను.. దానికి న్యాయం చేయాల‌నే స‌త్య అనేది క్రియేట్ అయ్యింది. 
 
నా బెస్ట్ ఫ్రెండ్ హ‌ర్షిత్ రెడ్డి నాకు ఈ స‌త్య‌ను డైరెక్ట్ చేసే అవ‌కాశం ఇవ్వ‌టం ల్యాండ్ మార్క్ మూమెంట్‌. స‌త్య అనేది నాజీవితం. నాదే కాదు.. చాలా మంది జీవితాల‌కు సంబంధించింది. హ‌ర్షిత్, హ‌న్షిత యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. స‌త్య మ్యూజిక‌ల్ షార్ట్ కోసం చాలా మంది క‌ష్ట‌ప‌డ్డారు. తేజ్‌కి థాంక్స్‌. గుడ్డి న‌మ్మ‌కంతో తేజ్ ఇందులో న‌టించాడు. త‌న న‌మ్మ‌కం చూసి నాకు భ‌య‌మేసింది. కానీ త‌ను ఏమాత్రం ఆలోచించ‌కుండా స‌పోర్ట్ చేశారు. అలాగే మా సాంగ్‌ను లాంచ్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌గారికి థాంక్స్‌... స‌పోర్ట్ అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 
 
నిర్మాత హ‌న్షిత మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో వ‌చ్చిన బ‌లగం సినిమా వ‌ల్ల సోసైటీ నుంచి చాలా మంచి అప్రిషియేష‌న్స్ వ‌చ్చాయి. మ‌ళ్లీ సోసైటీకి ఏమైనా చేద్దామ‌ని అనుకుంటున్న  ఆలోచ‌న నుంచి వ‌చ్చిందే స‌త్య‌. అంద‌రూ రెమ్యూన‌రేష‌న్ లేకుండా మంచి కార‌ణం కోసం చేశాం. తేజు, స్వాతి అద్భుతంగా న‌టించారు. శ్రుతి, సాకేలకు థాంక్స్‌’’ అన్నారు. 
 
నిర్మాత హ‌ర్షిత్ మాట్లాడుతూ ‘‘దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పెట్టింది యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఆలోచ‌న‌తోనే. కేవ‌లం సినిమాల‌తోనే చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు మాకు స‌త్య‌ ఆలోచ‌న వ‌చ్చింది. దీనికి న‌వీన్‌, తేజు తోడ‌య్యారు. సాంగ్‌ను లాంచ్ చేసిన చ‌ర‌ణ్ అన్న‌కు థాంక్స్‌. క‌చ్చితంగా ఇది అంద‌రినీ న‌చ్చుతుంది’’ అన్నారు. 
 
స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు మాట్లాడుతూ ‘‘మా బ‌లగం సినిమాకు చాలా ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్స్ వ‌చ్చాయి. చూస్తుంటే ఆస్కార్‌కి కూడా నామినేట్ అయ్యేలా క‌నిపిస్తుంది. మా డీఆర్‌పీ బ్యాన‌ర్ నుంచి కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాల‌ని అనుకుంటున్నప్పుడు వాళ్లు ఈ సాంగ్‌ను చేయాల‌నుకుంటున్నామ‌ని అన్నారు. నేను ఓకే చేశాను. ఇదే కాదు.. ఇంకా కొత్త టాలెంట్‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయాల‌ని అనుకుంటున్నాను. ఓ అమ్మాయి జీవితంలో ఎన్నో క‌లలుంటాయి. అలాంటి ఎన్నో క‌ల‌లు ఉండే అమ్మాయికి మిల‌ట‌రీ వ్య‌క్తి భ‌ర్త‌గా దొరికితే ఎలా ఉంటుంద‌నేదే స‌త్య‌. తేజు మా బ్యాన‌ర్‌లో ఇప్ప‌టికే మూడు సినిమాలు చేసేశాడు. దేశంలోని సైనికుల‌కు సంబంధించిన విష‌యాన్ని చెబుతూనే యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాల‌నుకుంటే తేజు వంటి వాళ్లు స‌పోర్ట్ చేయ‌టానికి ముందుకు వ‌చ్చారు. సాంగ్‌ను రిలీజ్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌గారికి థాంక్స్‌. హిందీతో పాటు తెలుగు, త‌మిళంలో సాంగ్ రిలీజ్ అయ్యింది’’ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖుషి షూటింగ్ టైమ్ లో లవ్ లో పడిపోయాను : సమంత