Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ ఇండస్ట్రీకి దిల్ రాజును పరిచయం చేస్తున్న ఎఫ్ 2...

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (17:20 IST)
విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ 'దిల్' రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్', 'ఆర్య', 'భద్ర', 'బొమ్మరిల్లు', 'పరుగు', 'కొత్తబంగారు లోకం', 'బృందావనం', 'మిస్టర్ ఫర్ఫెక్ట్', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ఎవడు', 'కేరింత', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'శతమానం భవతి', 'నేను లోకల్', 'దువ్వాడ జగన్నాథం - డీజే', 'ఫిదా', 'రాజా ది గ్రేట్', 'ఎంసీఏ', 'ఎఫ్ 2' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన ప్రేక్షకులకు అందించారు.
 
'దిల్' నుంచి ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన 'ఎఫ్2' వరకూ 'దిల్' రాజు నిర్మించిన చిత్రాల్లో అత్యధిక శాతం చిత్రాలు విజయాలు సాధిచాయి. హయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతల్లో ఆయన ఒకరు. ఎగ్జిబిట‌ర్‌గా, డిస్ట్రిబ్యూట‌ర్‌గా, నిర్మాతగా తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపును 'దిల్' రాజు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన హిందీ పరిశ్రమలో అడుగు పెడుతున్నారు. కుటుంబ కథా చిత్రాలకు వందకోట్ల రూపాయలు వసూలు చేసే సత్తా ఉందని నిరూపించిన 'ఎఫ్ 2'ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. నిర్మాతగా హిందీలో 'దిల్' రాజుకు తొలి చిత్రమిది.
 
ప్రముఖ తెలుగు నిర్మాత 'దిల్' రాజు, ప్రముఖ హిందీ నిర్మాత బోనీ కపూర్ సంయుక్తంగా 'ఎఫ్ 2' హిందీ రీమేక్ నిర్మించనున్నారు. హిందీలో అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తారు. ఇంతకుముందు ఈ దర్శకుడు తెలుగులో విజయవంతమైన 'రెడీ' చిత్రాన్ని సల్మాన్ ఖాన్, ఆసిన్ జంటగా అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అలాగే, 'పెళ్ళాం ఊరెళితే' చిత్రాన్ని 'నో ఎంట్రీ'గా రీమేక్ చేశారు. ఇప్పుడు 'ఎఫ్ 2' రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో నటించే హీరోలు, ఇతర తారాగణం తదితర వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments