Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే... శేష్‌ని అడిగాను. మ‌రి.. చేస్తాడో లేదో..? దిల్ రాజు

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (21:14 IST)
టాలెంటెడ్ హీరో అడివి శేష్, రెజీనా క‌సండ్ర, నవీన్ చంద్ర కీలక పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ఎవరు’. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్‌ పైన వెంకట్ రాంజీని దర్శకుడిగా పరిచయం చేస్తూ పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజై క్యాప్టివేటింగ్ హిట్‌గా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం పొందుతోంది. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – “ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి సినిమా మీద ఉన్న ఫ్యాషన్‌తో క్షణం అనే చిన్న కాన్సెప్ట్‌ని ఒక టీమ్ వర్క్‌గా చేసుకొని సినిమాను పెద్ద సక్సెస్ చేసి తనకంటూ ఒక ఐడెంటిటీని ఏర్పాటు చేసుకున్నారు అడివి శేష్. సర్... మాకు బ్యాక్ గ్రౌండ్ లేదు మా సినిమాలు ఎవరు చూస్తారు అనేది…. ఇండస్ట్రీలో నేను తరచుగా వినేమాట. అయితే దానికి ఉదాహరణ శేష్. 
 
మన దగ్గర టాలెంట్ ఉంటే కష్టపడి ఏదయినా చేయొచ్చు అని ఒక యాక్టర్‌గా ఈ స్థాయికి ఎదిగి నిరూపించాడు. నేను రిలీజ్‌కి ముందు రోజే సినిమా చూశాను. పాటలు, ఫైట్స్ లేకుండా వెంకట్ రాంజీ, శేష్ సినిమాను ఇంట్రెస్టింగ్‌గా నడిపారు. ఈమధ్య కాలంలో తెలుగు సినిమాలో ఇన్ని ట్విస్టులు, టర్న్‌లు ఇస్తూ కూడా ఆడియన్స్‌ని ఇంట్రెస్టింగ్‌గా కూర్చోబెట్టారు. మీడియా, ప్రేక్షకులు సినిమాకు మంచి రిపోర్ట్ ఇచ్చారు. 
 
వరల్డ్ వైడ్‌గా కూడా మంచి రెస్పాన్స్ ఉంది. రెజీనా మా బ్యానర్లో రెండు సినిమాలు చేసింది. ఆమె రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో బాగా పెర్ఫామ్ చేసింది. 
 
నిర్మాత పి.వి.పి గారు నా మిత్రుడు. మా ఫ్రెండ్ బ్యానర్లో మళ్ళీ ఒక మంచి సినిమా వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమాను నైజాంలో నేనే రిలీజ్ చేశాను. శేష్‌ని మా బ్యానర్లో కూడా ఇలాంటి సినిమా చేయమని అడిగాను. తన నెక్స్ట్ మూవీస్ తరువాత ఉండొచ్చు.. క్షణం, గూఢచారి, ఎవరుతో యాక్టర్‌గా అచీవ్ చేశాడు. అలాగే కొత్త దర్శకులు ఇలాంటి కాన్సెప్ట్‌లతో సినిమా చేయడానికి వస్తే మేము కూడా రెడీగా ఉన్నాం. టీమ్ అందరికీ బెస్ట్ విషెస్” అన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments