Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RowdybabyHits1BillionViews... కొలవెరికి తొమ్మిదేళ్లు..

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (20:35 IST)
ఫిదా భామ సాయిపల్లవి ఖాతాలో కొత్త రికార్డు నమోదైంది. తమిళ నటుడు ధనుష్ నటించిన మారి 2 చిత్రంలోని రౌడీ బేబీ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఫిదా భామ ఖాతాలో ఈ రికార్డు జమ అయ్యింది. రౌడీ బేబీ పాట ఇప్పటివరకూ వన్ బిలియన్ వ్యూస్ దక్కించుకుంది. 
 
యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ పాట అందరినీ ఉర్రూతలూగించింది. 2018లో విడుదలైన ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా రౌడీ బేబీ పాట మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ట్యూన్‌కి తోడు సాయి పల్లవి, ధనుష్‍ల డాన్స్ కూడా బాగా అలరించింది.
 
ఐతే రౌడీ బేబీ పాట వన్ బిలియన్ వ్యూస్ అందుకున్న ఈ రోజే (నవంబర్-16) ధనుష్ పాడిన కొలవెరి డీ పాట తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ మేరకు ధనుష్ ట్విట్టర్ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. ఒకే రోజున రెండు పండగలు వచ్చినంత ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. 
 
అటు సాయిపల్లవి కూడా తను నటించిన సినిమాలోని పాట వన్ బిలియన్ వ్యూస్ దక్కించుకున్నందుకు హర్షం వ్యక్తం చేసింది. కాగా రౌడీ బేబీ పాటకు ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments