ఆసక్తిని కలిగిస్తోన్న 'దేవి 2' టీజర్ (video)

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (18:22 IST)
కొంతకాలం క్రితం విజయ్ దర్శకత్వంలో... ప్రభుదేవా - తమన్నా ప్రధాన పాత్రధారులుగా 'దేవి' అనే తమిళ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే... హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో 'అభినేత్రి' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి... భారీ వసూళ్లతో విజయాలను అందుకుంది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా 'దేవి 2' సినిమాని నిర్మించడం జరిగింది. కాగా... తాజాగా ఈ సినిమా నుండి ఒక టీజర్ విడుదల చేయబడింది. 
 
ప్రభుదేవా.. తమన్నా.. నందిత శ్వేత.. కోవై సరళ వంటి ప్రధానమైన పాత్రలపై కట్ చేసిన ఈ టీజర్ చాలా ఆసక్తి కలిగిస్తోంది. ఏప్రిల్ 12వ తేదీన విడుదల కానున్న ఈ సస్పెన్స్‌తో కూడిన హారర్ సినిమా సక్సెస్ అయ్యే లక్షణాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. 
 
కాగా... ఏప్రిల్ 19న లారెన్స్ 'కాంచన 3' రానుంది. ప్రభుదేవా.. లారెన్స్‌లు ఇద్దరూ కొరియోగ్రఫర్లుగా ప్రారంభమై... దర్శకులుగానూ.. నటులుగానూ రాణించినవారే. అలాంటి ఈ ఇద్దరూ హారర్ కాన్సెప్ట్‌లతో చాలా తక్కువ గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తూండడం విశేషమే మరి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎరుపు జరి, చిలుకపచ్చ రంగు.. మహిళలకు ఉచిత చీరల పంపిణీ

Heat Wave Forecast: ఏపీలో వేడిగాలులు.. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు..

నాటో సహా మిత్ర దేశాలకు ఏమీ అర్థం కాదు : డోనాల్ట్ ట్రంప్ అసహనం

సెలవుల్లో గ్రామానికి వెళ్లిన విద్యార్థినిలు... సరదా కోసం సెల్ఫీకి యత్నించి చనిపోయారు..

11 యేళ్ల బాలికపై అత్యాచారం .. ఎవరికీ చెప్పొద్దంటూ రూ.150 చేతిలో పెట్టాడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వుందా? ఐతే ఈ ఫ్రూట్స్ తిని చూడండి

పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments