Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ‌ర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ని అడ్డుకుంటారా..? శ్రీదేవి వుంటే కన్నీళ్లు పెట్టుకునేది..

Advertiesment
వ‌ర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ని అడ్డుకుంటారా..? శ్రీదేవి వుంటే కన్నీళ్లు పెట్టుకునేది..
, గురువారం, 21 మార్చి 2019 (12:37 IST)
వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ నుంచి ఇబ్బందులు ఎద‌ర‌వ్వ‌డం.. వర్మ ఫైట్ చేయ‌డం... ఆఖ‌రికి సెన్సార్ బోర్డ్ దిగొచ్చి సెన్సార్ చేస్తాన‌న‌డం తెలిసిందే. అయితే... ఈ విష‌యం గురించి సెన్సార్ బోర్డ్  క్లియరెన్స్ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి.  హైదరాబాద్‌లో అతిలోక సుందరి శ్రీదేవి పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఆయన సినిమాల విడుదల విషయంలో సెన్సార్ బోర్డ్ వ్యవహరిస్తున్న తీరుపై ఫైర్ అయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆర్ నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ.. గతంలో నా సినిమాలకు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. దీనిపై చాలాసార్లు నేను మాట్లాడాను. ఈ అంశంపై ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
 
గతంలో నా సినిమా సెన్సార్ ఇబ్బందుల వల్ల బొంబాయి వెళ్లా. అక్కడ ఉన్న శ్రీదేవి తన పీఏతో విషయం తెలుసుకుని నాతో మాట్లాడారు. సమస్య ఏంటి అని అడిగారు. సెన్సార్ కాలేదు అని చెప్పా. మీరు విప్లవ సినిమాలు బాగా తీస్తారండీ.. నాకు విప్లవ సినిమాలు తీయలని ఉందని చెప్పింది మహాతల్లి. 
 
ఇవాళ ఆ శ్రీదేవి ఉండి ఉంటే సెన్సార్‌‌లో జరుగుతున్న వాటిని చూసి నిజంగా కన్నీళ్లు పెట్టుకునేది. ఇది ఎంత దుర్మార్గం. ఈరోజు రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాను సెన్సార్ చేయరా..? ఎవరో వచ్చి వేలు పెడితే ఆపేస్తారా..? డెమెక్రసీ ఎక్కడ ఉంది. సెన్సార్ బోర్డ్ ఎక్కడ ఉంది..? 
 
సెన్సార్ వ్యవహరిస్తున్న ఈ దుర్మార్గమైన తీరును ఇండస్ట్రీ మొత్తం ఖండించాలి. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సినిమా తీస్తే సెన్సార్ ఆపేస్తారా? వీటిపై వివరణ ఇచ్చేందుకు అమరావతి వెళ్లాలా..? కాబట్టి ప్రొడ్యుసర్ కౌన్సిల్ నుండి ఫిల్మ్ ఛాంబర్ వరకూ ముక్త కంఠంతో సెన్సార్ విధానాన్ని తిరస్కరించాలని పిలుపునిచ్చారు ఆర్ నారాయణ మూర్తి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'వినరా సోదరా వీర కుమారా' నేటి యువత ట్రెండ్‌కి అద్దం.. రివ్యూ