Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో థియేటర్లు మూసివేత - పాన్ ఇండియా చిత్రాలకు షాక్

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (12:16 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ వైరస్ వణుకు పుట్టిస్తుంది. దీంతో ఈ వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తుంది. ఇందులోభాగంగా, థియేటర్లతోపాటు విద్యా సంస్థలను మూసివేతకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి నోటీసులు వచ్చేంత వరకు థియేటర్లు మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అలాగే, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. 
 
ఇకపోతే, మహారాష్ట్రలోనూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ఇదే తరహా ఆంక్షలు అమల్లోవున్నాయి. మహారాష్ట్రలో అయితే, 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లలో సినిమాల ప్రదర్శన సాగుతోంది. 
 
దీంతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే భారీ బడ్జెట్ చిత్రాలకు ఇది పెద్ద దెబ్బే. ముఖ్యంగా, వచ్చే నెల 7వ తేదీన  విడుదలకానున్న "ఆర్ఆర్ఆర్", ఆ తర్వాత విడుదలయ్యే "రాధేశ్యామ్", "వలిమై" వంటి చిత్రాలపై తీవ్రప్రభావం చూపనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments