రాధేశ్యామ్ సినిమా నాలుగేళ్ళనాడు మొదలైంది. షూటింగ్ పూర్తయి విడుదలకు రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా కథ చేయిచూసి జాతకాలు చెప్పే నాయకుడి కథ. దానిని ప్రభాస్ పోషించాడు. ఈ కథ అనుకున్నప్పుడు దేశంలో పలువురు జ్యోతిష్కపండితులను దర్శకుడు రాధాకృష్ణ కలిశారు. వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని సినిమా చేయడం మొదలు పెట్టారు. అయితే కేరళకు చెందిన ఓ జ్యోతిష్కుని దగ్గరకు వెళ్పినప్పుడు ఆయన చెప్పిన నిజం దర్శక నిర్మాతలకు షాక్‌కు గురిచేసింది.
అదేమంటే, ఈ సినిమా 2022 ప్రథమార్థంలో బయటకు వస్తుందని చెప్పడమే. అప్పటికీ అంటే 2018లో దేశంలో పరిస్థితులు బాగానే వున్నాయి. అసలే సినిమావాళ్ళు జాతకాలును పట్టించుకుంటారు. పైగా జాతకాల సినిమా కనుక దర్శక నిర్మాతలు తప్పక నమ్మాల్సి వచ్చింది. ఆ తర్వాత షూటింగ్ జరిగే క్రమంలో ఈజిప్టు వంటి విదేశాల్లో చేయడంతో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. అలా సినిమా షూటింగ్ జరుగుతూ జరుగుతూ 2020కి పూర్తయింది. కానీ విడుదలచేయడానికి కరోనా బ్రేక్ వేసింది. అలా 2021 లో విడుదలకు ట్రై చేశారు. మరలా సెకండ్ వేవ్ వచ్చింది. ఇక అన్నీ సర్దుకున్నాయి అనుకున్నాక సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా వల్ల కొన్ని సినిమాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి కలిగింది.
కట్ చేస్తే, ఇప్పుడు 2022 సంక్రాంతికి కూడా విడుదలకాకపోవచ్చని దర్శక నిర్మాతలకు అనిపిస్తుంది. ఇందుకు కారణం పాన్ ఇండియా మూవీ కావడమే. ప్రస్తుతం ఢిల్లీలో లాక్‌డౌన్ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మహారాష్ట్రలో సాయంత్రం అయితే కర్ఫూ, ఇక దక్షిణాదిలో కొన్ని చోట్ల అదే పరిస్థితి. ఇక ఆంధ్రలో సి సెంటర్లలో థియేటర్లు మూతపడ్డాయి. బి సెంటర్లలో కూడా అదే పరిస్థితి. కనుక పెట్టిన వందల కోట్ల పెట్టుబడిని రాబట్టాలంటే ఇప్పటి పరిస్థితికి వర్కవుట్ అయ్యేట్లు లేదు. కాబట్టి కేరళ జ్యోతిష్యుడు చెప్పినట్లు 2022 ప్రథమార్థంలో విడుదల అన్న మాటలో అర్థం జూన్‌లోపల అని అన్నమాట. ఈ విషయం ఇప్పటికి దర్శక నిర్మాతలకు తెలిసి సంక్రాంతికి వాయిదా వేసుకోవాలనే ఆలోచనలో వున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు వైజాగ్‌లో రాధేశ్యామ్ మ్యూజికల్ టూర్ మంగళవారం ప్రారంభించారు. యాత్ర బస్‌కు గుమ్మడికాయ దిష్టి కొట్టి ప్రభాస్ సినిమాకు దిష్టి తగిలిందని అందుకే మేం ఇలా చేసి యాత్ర ప్రారంభించామని చెబుతున్నారు. నేటి నుంచి అభిమానుల హంగామా మొదలైంది.
వైజాగ్ నుండి ప్రారంభమయిన ఈ యాత్ర ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలిమరి.