Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంతారాను వదలని వివాదాలు.. ఆ పాటపై నిషేధం.. పాలక్కాడ్ కోర్టు

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (10:19 IST)
కాంతారా సినిమా ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కలెక్షన్లు అదుర్స్ అనిపిస్తున్నాయి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో విడుదలైన కాంతార సినిమాకు కలెక్షన్లు ఎలా వస్తున్నాయో.. వివాదాలు కూడా వీడటం లేదు. ఇప్పటికే ఈ చిత్రంలోని వరాహ రూపం సాంగ్‌పై కేరళలోని కోయిక్కోడ్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. 
 
ఈ పాటను ఎక్కడా ప్లే చేయకూడదని.. థియేటర్లలో అసలు వినిపించకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తాజాగా మరోసారి చిత్రబృందానికి పాలక్కాడ్ కోర్టు నుంచి షాక్ తగిలింది. కేరళలోని పాలక్కాడ్ స్థానిక కోర్టు ఈ పాటను నిలిపివేయాలని ఆదేశించింది.
 
వరాహరూపం పాట కాపీ చేశారంటూ తైక్కుడం బ్రిడ్జ్ యూనిట్ ఆరోపించింది. తన నవరసం ట్యూన్‏ను వరాహరూపం పాటలో ఉపయోగించారని ఆరోపణలు వచ్చిన తరుణంలో ఈ పాటపై కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారించిన కేరళ స్థానిక కోర్టు వరాహరూపం పాటపై స్టే విధించింది. 
 
ఇక ఇప్పుడు పాలక్కాడ్ కోర్టు కూడా ఇదే విధమైన ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ పాటను ఎక్కడా షేర్ చేయడం గానీ, ప్రసారం చేయడం గానీ కుదరదని పేర్కొంది. 
 
అయితే "తైక్కుడం బ్రిడ్జ్" బ్యాండ్‌కు చెందిన వియాన్ ఫెర్నాండెజ్ ఇటీవలే తమకు క్రెడిట్ ఇస్తే ఈ పాటను ప్లే చేయడానికి ఇబ్బంది లేదని తేల్చేశారు. మరి ఈ వివాదంపై కాంతారా యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రైవర్ డోర్ డెలివరీ హత్య కేసు పునర్విచారణ : స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

డివైడర్‌ను ఢీకొట్టి బొమ్మకారులా గిరికీలు కొట్టిన స్కార్పియో (video)

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments