Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంతార సినిమాకు బిగ్ షాక్.. 'వరాహ రూపం' పాట వివాదం..

Advertiesment
Kanthara
, శనివారం, 29 అక్టోబరు 2022 (11:59 IST)
హిట్ టాక్‌తో దూసుకుపోతున్న కాంతార సినిమాకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఈ సినిమాలో వరాహ రూప పాట విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాటను నిలిపివేయాలని... కోర్టు కాంతార మేకర్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. 
 
కన్నడ సినిమా కాంతర క్రేజ్ సామాన్య ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు పాకింది. ఈ సినిమాను ఇప్పుడు వరుసగా సెలబ్రిటీలంతా చూస్తున్నారు. సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. విడుదలైన అన్ని భాషాల్లో కూడా హిట్ టాక్ అందుకుంది. ప్రతీ చోట కాంతారకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు.  
 
అయితే తాజాగా కాంతార టీంకు బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమాలోని వరాహ రూపం పాట వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాట ట్యూన్ మలయాళ ఆల్బమ్ సాంగ్ నుంచి కాపీ కొట్టారంటూ వివాదం మొదలైంది.  కాంతారాలోని వరాహ రూపం పాట తమ పాటకు కాపీకి అని కేరళకు చెందిన ప్రముఖ మ్యూజిక్‌ బ్యాండ్‌ తైక్కుడం బ్రిడ్జి ఆరోపిస్తోంది.
 
ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన వివాదంలో తాజాగా బిగ్ ట్విస్ట్ వచ్చింది. 'వరాహ రూపం' పాటను ప్లే చేయడాన్ని నిలిపివేయాలని కాంతారావు నిర్మాతలను కోర్టు ఆదేశించింది. కోజికోడ్‌ సెషన్స్‌ కోర్టు అక్టోబర్‌ 28, శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇప్పుడు కాంతార పాట కాపీ రైట్స్ విషయంలో కీలక మలుపుగా మారింది .
 
తమ పాపులర్ ఆల్బమ్ 'నవరస'ని కాపీ చేసినందుకు కాంతారావు క్రియేటివ్ టీమ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ గతంలో స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీనాక్షి చౌదరి హాట్‌నెస్ కోటీని పెంచింది