Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలీని అలా సర్దేశారు.. ఇప్పటికే ఇద్దరు కృష్ణులు.. ఇపుడు మూడో కృష్ణుడుగా హాస్య నటుడు

Advertiesment
ALi_Jagan
, శుక్రవారం, 28 అక్టోబరు 2022 (11:17 IST)
తెలుగు హాస్య నటుడు అలీని వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలా సర్దేశారు. ఇప్పటికే మీడియాకు ఇద్దరు సలహాదారులు ఉన్నారు. ఇపుడు మూడో సలహాదారుడుగా అలీని నియమించారు. నిజానికి వైకాపా సభ్యత్వం తీసుకున్న అలీని రాజ్యసభకు పంపిస్తారని, ఎమ్మెల్సీ చేస్తారనీ, మైనారిటీ కమిషన్ ఛైర్మన్ చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగింది. కానీ, వీటిలో ఏ ఒక్కటీ ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా, ఒక సలహాదారు పోస్టు ఇచ్చి అలా సరిపుచ్చారు. 
 
నిజానికి గతంలో సీఎం జగన్‌ను తన సతీమణితో కలిసిన అలీ... ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే మంచి రోజు వస్తుంది అని తనకు సీఎం చెప్పారని వెల్లడించారు. దీంతో అలీని రాజ్యసభకు పంపిస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, అది నిజం కాలేదు. 
 
ఆ తర్వాత రెండు రోజులకు అలీని మైనారిటీ కమిషన్ ఛైర్మన్‌గా నియమిస్తారంటూ ప్రభుత్వ వర్గాలు లీకులు ఇచ్చారు. అలీకి ఆ పదవి కూడా లభించలేదు. చివరకు ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు తరహాలో ఇప్పటికే ఇద్దరు మీడియా సలహాదారులుండగా, మరో సలహాదారుగా అలీని నియమించడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దొంగలను ప్రతిఘటించిన వీర వనిత.. కత్తితో పొడిచినా వెనక్కి తగ్గలేదు..