Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదంలో డీఎస్పీ ఆల్బమ్ సాంగ్.. కరాటే కళ్యాణి ఫిర్యాదు

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (09:58 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఇటీవల ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇపుడు ఈ ఆల్బమ్ వివాదంలో చిక్కుకుంది. "హరే రామ హరే కృష్ణ" అంటూ సాగే ఈ పాట సాగుతోంది. దీనిపై సినీ నటి కరాటే కళ్యాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిందూభక్తుల మనోభావాలు కించపరిచేలా ఆల్బమ్ సాంగ్ రూపొందించినట్టు సంగీత దర్శకుడు దేవీశీ ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తుంది. 
 
ఇదే అంశంపై కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదులో "హరే రామ, హరే కృష్ణ అనే పవిత్ర భజనను ఓ ఐటెం సాంగ్‌గా మలిచారంటూ దేవీశ్రీ ప్రసాద్‌పై ఆరోపణలు వచ్చాయి. పవిత్ర మంత్రాన్ని ఐటెం సాంగ్‌గా చిత్రీకరించారని దేవీశ్రీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఆమెతో పాటు పలు హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నగర నేర విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అయితే, ఈ వివాదంపై దేవీశ్రీ ప్రసాద్ ఇంకా స్పందించలేదు. ఈ పాటను మూడు వారాల కిందట యూట్యూబులో పోస్టు చేయగా, ఇప్పటివరకు 2.5 మిలియన్ల వ్యూస్‌ను రాబట్టింది. ఈ పాటకు సంగీతం, సాహిత్యం, గాత్రం అన్నీ దేవీశ్రీ ప్రసాద్ సమకూర్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments