Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ మరో ఇటలీ కాకూడదు.. సూర్య : స్వీయనిర్బంధంలో బాలీవుడ్ ప్రేమజంట

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (11:52 IST)
కరోనా వైరస్ మరింతగా వ్యాపించకుండా కేంద్రంతో పాటు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్ ఆంక్షలను ప్రతి ఒక్కరూ పాటించాలని తమిళ హీరో సూర్య విజ్ఞప్తి చేస్తున్నారు. భారత్.. మరో ఇటలీ కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమతమ గృహాలకే పరిమితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఇదే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తన ట్విట్టర్ ద్వారా ఓ చిన్నపాటి వీడియోను రిలీజ్ చేశారు. వరదలు, తుఫాన్లు, జల్లికట్టు వంటి వాటి విషయంలో రోడ్డెక్కి పోరాడామని, ప్రస్తుతం కరోనాపై ఇంట్లో ఉండే పోరాడుదామని పిలుపునిచ్చారు. 
 
చైనా కంటే ఇటలీలోనే కరోనా కారణంగా ప్రాణనష్టం అధికంగా ఉందని ఆయన గుర్తు చేశారు. కరోనా తీవ్రతను గ్రహించకుండా ఇటలీ ప్రజలు బయట తిరగడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. భారత్‌ మరో ఇటలీ కాకూడదని సూర్య అభిప్రాయపడ్డారు. 
 
ముఖ్యంగా, ప్రతి పౌరుడూ తమవంతు బాధ్యతగా సామాజిక దూరం పాటించాలని సూర్య కోరారు. ముఖాన్ని చేతులతో ముట్టుకోకూడదని, జ్వరం, దగ్గుతో బాధ పడుతుంటే కరోనా వైరస్‌ సోకినట్లు కాదని, అయినప్పటికీ ఆరు రోజులు ఎవరితోనూ కలవకుండా ఉండాలని, అప్పటికీ సమస్య ఉంటే ఆసుపత్రికి వెళ్లాలని కోరారు. 
 
స్వీయ నిర్బంధంలో ప్రేమజంట
మరోవైపు, కరోనా వైరస్ దెబ్బకు దేశ వ్యాప్తంగా సినిమా షూటింగ్‌లన్నీ రద్దు అయ్యాయి. దీంతో సెలెబ్రిటీలు తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. అలాంటి వారిలో ఓ బాలీవుడ్ ప్రేమజంట కూడా ఉంది. ఆ ప్రేమ జంట ఎవరో కాదు.. మలైకా అలోరా, అర్జున్ కపూర్. గత యేడాది కాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం కరోనా వైరస్ పుణ్యమాని ఒకే ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments