Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌పై పోరు : అమితాబ్ బచ్చన్ విరాళం

Webdunia
సోమవారం, 10 మే 2021 (10:46 IST)
క‌ష్ట‌మొచ్చిన‌ప్పుడ‌ల్లా తామున్నామ‌నే భ‌రోసా ఇస్తూ ప్ర‌జ‌ల గుండెల‌లో కొందరు సెలెబ్రిటీలు చెర‌గ‌ని ముద్రవేస్తుంటారు. ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండ‌టంతో ఈ పోరులో మేము భాగం అవుతామంటూ విరాళాలు అందిస్తున్నారు. 
 
కొంద‌రు ఆక్సిజ‌న్, మందులు వంటివి సాయం చేస్తున్నారు. తాజాగా అమితాబ్ వ‌చ్చ‌న్ రూ.2 కోట్లు విరాళ‌మిచ్చి మంచి మ‌న‌సు చాటుకున్నారు. ఢిల్లీలోని రకబ్ గంజ్ గురుద్వారాను కోవిడ్ కేంద్రంగా మార్చిన నేపథ్యంలో దీనికి ఆయన రూ.2 కోట్లు విరాళమిచ్చారు. 
 
ఈ విషయాన్ని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు మజిందర్ సింగ్‌ వెల్లడించారు. 300 పడకలు గల ఈ కేంద్రం నేటి నుండి ప్రారంభంకానుండ‌గా, ఈ కేంద్రానికి విదేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు ఇతర వైద్య పరికరాలను కూడా తెప్పిస్తానని అమితాబ్ బచ్చన్ హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. 
 
బిగ్ బీ ప్రతి రోజూ ఫోన్ చేసి ఈ కేంద్రానికి అవసరమైన సదుపాయాల గురించి ఆరా తీస్తున్నార‌ట‌. రానున్న రోజుల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని అమితాబ్ మాటిచ్చార మజిందర్ సింగ్‌ వెల్లడించారు. 
 
అలాగే, మరికొందరు సెలెబ్రిటీలు కూడా తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే బాలీవుడ్ హీరో సోనూ సూద్ ఇప్పటికే కోట్లాది రూపాయల సొంత డబ్బులతో కష్టాల్లో వున్నవారిని ఆదుకుంటున్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments