Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోనియా ఉదారత : రాయ్‌బరేలీలో కోవిడ్ రోగుల సేవల కోసం రూ.1.17 కోట్లు

Advertiesment
Sonia Gandhi
, ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (14:03 IST)
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ఉదారతను చూపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో కోవిడ్-19 సంబంధిత సేవల కోసం నిధులు మంజూరు చేశారు. ఆమె శుక్రవారం రాయ్ బరేలీ జిల్లా మేజిస్ట్రేట్‌కు రాసిన లేఖలో తన ఎంపీ నిధుల నుంచి ఈ సొమ్మును తీసుకుని, కోవిడ్-19 మహమ్మారి బాధితులను కాపాడటం కోసం ఖర్చు చేయాలని కోరారు. 
 
ప్రజలంతా ఇళ్ళలోనే ఉండాలని, అవసరం లేకుండా బయటకు రావద్దని కోరారు. అందరూ కోవిడ్ సంబంధిత మార్గదర్శకాలను పాటించాలని కోరారు. సోనియా గాంధీ రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఆక్సిజన్ సకాలంలో అందకపోవడంతో ఐదుగురు కోవిడ్-19 పాజిటివ్ రోగులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆమె ఈ లేఖ రాశారు. రాయ్‌బరేలీలోని కోవిడ్-19 పాజిటివ్ రోగులకు అవసరమైన సేవలను అందించడం కోసం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.1.17 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు భవనం కూల్చివేత